Priyamani: ఫ్లోరల్ ఫ్రాక్ లో సూపర్ షేకులు... ఢీ జడ్జి ప్రియమణి సొగసుల జడివానలో తడిసిపోతున్న ఫ్యాన్స్ 

Published : Apr 27, 2022, 11:24 AM IST

ఢీ జడ్జి ప్రియమణి తన అందాల జడిలో ముంచేసింది. ఫ్లోరల్ ఫ్రాక్ ధరించి సూపర్ షేకులతో చంపేసింది. సీనియర్ బ్యూటీ ట్రెండీ లుక్ లో కేకపుట్టిస్తుండగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

PREV
19
Priyamani: ఫ్లోరల్ ఫ్రాక్ లో సూపర్ షేకులు... ఢీ జడ్జి ప్రియమణి సొగసుల జడివానలో తడిసిపోతున్న ఫ్యాన్స్ 
Priyamani

లెక్కకు మించిన ఆఫర్స్ తో దూసుకుపోతోంది ముదురు హీరోయిన్ ప్రియమణి(Priyamani). అటు హీరోయిన్ గా ఇటు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. పలు రకాల పాత్రలకు ప్రియమణి బెస్ట్ ఛాయిస్ అయ్యారు. దీంతో ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

29
Priyamani


ప్రియమణి లేటెస్ట్ మూవీ భామా కలాపం (Bhama Kalapam). అనుపమ ఘుమ ఘుమ అంటూ యూట్యూబ్ లో వంటలు చేసే గృహిణిగా ప్రియమణి ఆకట్టుకుంది. హ్యూమరస్ క్రైమ్ డ్రామాగా భామా కలాపం తెరకెక్కింది. ఈ మూవీ ఆహా లో ఫిబ్రవరి 11 నుండి స్ట్రీమ్ అవుతుండగా, పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
 

39
Priyamani


ఫ్యామిలీ మాన్ సిరీస్ తో ప్రియమణి బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సీజన్ వన్ తో పాటు సీజన్ 2లో కూడా ఆమె నటించారు. సమంత, మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో ప్రియమణి మనోజ్ భార్య రోల్ చేయడం జరిగింది. సీజన్ వన్ లో కూడా ప్రియమణి మనోజ్ భార్య పాత్ర చేసిన విషయం తెలిసిందే.

49
Priyamani

ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగల ప్రియమణి బెస్ట్ ఛాయిస్ గా మారారు. ది ఫ్యామిలీ మాన్ సిరీస్ లో ప్రియమణి పాత్ర అలరిస్తుంది.ఇక తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో కలిపి ఏడు చిత్రాల వరకు ప్రియమణి చేస్తున్నారు. వీటిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రానా-సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న విరాట పర్వం మూవీలో ప్రియమణి లేడీ నక్సల్ రోల్ చేస్తున్నారు. 

59
Priyamani

ఢీ జడ్జిగా ప్రియమణి బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేస్తుంది. ఇటీవల ఢీ సీజన్ 13 ముగిసింది. వెంటనే సీజన్ 14 ప్రారంభమైంది. కొత్త సీజన్ కి కూడా ప్రియమణి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మరో జడ్జి పూర్ణతో పాటు యాంకర్స్ రష్మీ, సుడిగాలి సుధీర్, దీపికా పిల్లిని తొలగించిన నిర్వాహకులు ప్రియమణిని మాత్రం కొనసాగిస్తున్నారు.

69
Priyamani

ఇక ప్రియమణి వ్యక్తిగత జీవితంపై కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి. భర్త ముస్తఫా రాజ్ తో ఆమె విడిపోతున్నారని, ఇద్దరూ విడాకులకు సిద్ధమయ్యారని కథనాలు వెలువడ్డాయి. అయితే దీపావళి వేడుకలలో జంటగా కనిపించిన ప్రియమణి, ముస్తఫా... ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు.
 

79
Priyamani

ఈవెంట్ ఆర్గనైజర్ అయిన ముస్తఫా రాజ్.... వృతి రీత్యా చాలా కాలంగా అమెరికాలోనే ఉంటున్నారు. నటిగా బిజీగా ఉన్న ప్రియమణి ఇండియాకు పరిమితం అయ్యారు.
 

89
Priyamani

ముస్తఫా మొదటి భార్య... వీరి వివాహం చెల్లదని న్యాయ పోరాటం చేస్తుండగా, ప్రియమణి విడాకుల వార్తలకు ప్రాధాన్యత దక్కింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపుతుంది ప్రియమణి.

99
Priyamani

ఢీ జడ్జి ప్రియమణి తన అందాల జడిలో ముంచేసింది. ఫ్లోరల్ ఫ్రాక్ ధరించి సూపర్ షేకులతో చంపేసింది. సీనియర్ బ్యూటీ ట్రెండీ లుక్ లో కేకపుట్టిస్తుండగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

click me!

Recommended Stories