అనంతరం పృథ్వి తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటనని వివరిస్తాడు. నటుడిగా బాగా బిజీగా ఉన్న సమయంలో మాకు ఒక బాబు పుట్టాడు. డబ్బు కూడా బాగా సంపాదిస్తున్నాను. కానీ ఒకరోజు మా బాబుకి బాగాలేకుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళాం. పిల్లాడి మెంటల్ కండిషన్ బాగాలేదని డాక్టర్ చెప్పారు. ఆ క్షణం అనిపించింది.. ఈ సినిమాలు, డబ్బు, అవార్డులు ఎవరి కోసం అని.