50 సెకండ్ల యాడ్ కి అన్ని కోట్లా... నయనతారకు ఎందుకంత క్రేజ్!

Published : Mar 17, 2024, 07:19 AM IST

స్టార్ హీరోలకు సమానంగా స్టార్డం అనుభవిస్తుంది నయనతార. కాగా నయనతార ఒక యాడ్ కి భారీగా వసూలు చేసిందట. దీనికి సంబంధించిన ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.   

PREV
15
50 సెకండ్ల యాడ్ కి అన్ని కోట్లా... నయనతారకు ఎందుకంత క్రేజ్!

నయనతార పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు అవుతుంది. అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ అయ్యింది. నయనతార ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్. సినిమాకు ఐదు కోట్లకు పైగా వసూలు చేస్తుంది. 

25

కాగా నయనతారకు డిమాండ్ ఉన్నా... పెద్దగా యాడ్స్ చేయదు. కారణం తెలియదు కానీ నయనతార వ్యాపార ప్రకటనల్లో కనిపించింది తక్కువే. అయితే ఓ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన నయనతార భారీగా వసూలు చేసినట్లు సమాచారం.

 

35

వివరాల్లోకి వెళితే.. టాటా స్కై ప్రమోషనల్ యాడ్ లో నయనతార నటించింది. 50 సెకండ్స్ నిడివి కలిగిన ఈ యాడ్ కి నయనతార ఏకంగా రూ. 5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. స్టార్ హీరోలు కూడా ఈ రేంజ్ లో వసూలు చేయరు. నయనతార అన్ని కోట్లు తీసుకోవడంతో అందరు షాక్ అవుతున్నారు. 

45

మరోవైపు నయనతార జవాన్ మూవీతో బాలీవుడ్ లో కూడా హిట్ కొట్టింది. షారుక్ ఖాన్ హీరోగా గత ఏడాది విడుదలైన జవాన్ బ్లాక్ బస్టర్ అందుకుంది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఆమెకు డిమాండ్ ఏర్పడింది. 

 

55

కాగా నయనతార 2022లో ప్రియుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు. సరోగసి ద్వారా నయనతార తల్లైన విషయం తెలిసిందే. విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకోవడానికి మునుపు నయనతార శింబు, ప్రభుదేవాలతో రిలేషన్ నడిపింది. 

click me!

Recommended Stories