గ్రాండ్‌గా బాలయ్య భామ నమిత సీమంతం.. ఫోటోలు వైరల్‌

Published : Jun 04, 2022, 08:46 PM IST

బాలయ్య భామ నమిత సీమంతం చేసుకుంది. ఆమె గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. గ్రాండ్‌గా జరిగిన సీమంతం ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  

PREV
16
గ్రాండ్‌గా బాలయ్య భామ నమిత సీమంతం.. ఫోటోలు వైరల్‌

`జెమినీ` సినిమాతో తెలుగులో మెరిసిన ఆ తర్వాత ఓఊపు ఊపిన నమిత వ్యాపారవేత్త, యాక్టర్‌ వీరేంద్రని మ్యారేజ్‌ చేసుకుని ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌లో బిజీగా ఉంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేసింది. గత కొన్ని రోజుల క్రితం ఆమె ప్రెగ్నెన్సీని ప్రకటించింది. బేబి బంమ్స్ తో దిగిన ఫోటోలను పంచుకుంటూ తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. 

26

ఆ తర్వాత వరుస బేబీ బంమ్స్ ఫోటోలతో ఆకట్టుకుంటూ సోషల్‌ మీడియా రచ్చ చేస్తున్న నమిత సీమంతం చేసుకుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా ఆమె సీమంతం వేడుక జరిగింది.ప్రస్తుతం ఆ ఫోటోలు బయటకు వచ్చాయి. అవి ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. 
 

36

తన భర్త మల్లిరెడ్డి వీరేంద్ర చౌదరితోపాటు ఫ్యామిలీ మెంబర్స్ తో దిగిన సీమంతం ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో వీరేంద్ర వైట్‌ షర్ట్ పంచ కట్టుకోగా, బ్లూ శారీలో నమిత మెరిసిపోతుంది. ఆమె ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. 

46

ఇక `సొంతం` సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నమిత. ఆ తర్వాత `జెమినీ`,`ఒకరాజు ఒక రాణి`, `ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి`, `ఐతే ఏంటీ?`, `నాయకుడు`, `బిల్లా`, `సింహా` చిత్రాల్లో నటించింది. ఆమెకి తెలుగులో విజయాలు దక్కింది చాలా తక్కువ. కానీ `సింహా` సినిమాలో హాట్‌ గా కనిపించింది. బాలయ్యతో రొమాన్స్ చేసి వాహ్‌ అనిపించింది. 
 

56

కాకపోతే తమిళం, కన్నడలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది నమిత. ఆ తర్వాత 2017లో ఆమె యాక్టర్‌, బిజినెస్‌ మ్యాన్‌ వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంది. మ్యారేజ్‌ తర్వాత కూడా ఒకటి అర సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె ఇటీవల తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. ఆతర్వాత ప్రెగ్నెన్సీ ఫోటో షూట్‌లతో ఇంటర్నెట్‌లో రచ్చ లేపింది. భారీ హాట్‌ అందాలతో రచ్చ చేసింది. 

66

ఇటీవల రెడ్‌ డ్రెస్‌ కప్పుకుని ఆమె ఇచ్చిన బేబీ బంప్‌ ఫోటోలు ఇంటర్నెట్‌లో దుమారం రేపాయి. ఆమె అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ప్రెగ్నెన్సీలోనూ నమిత తగ్గేదెలే అంటూ పోజులివ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.ఇక ఇప్పుడు 41 ఏళ్ల వయసులో నమిత తల్లి కాబోతుండటం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories