నభా ఇంస్టాగ్రామ్ లో... 'నేను గత ఏడాది సినిమాలు చేయలేదు. నాకు లాగే మీకు కూడా మిస్సింగ్ ఫీలింగ్ కలిగి ఉంటుందని నాకు తెలుసు. 2022లో నేను ఒక ప్రమాదానికి గురయ్యాను. నా ఎడమ భుజం మల్టీ ఫ్రాక్చర్స్ కి గురైంది. చికిత్స లో భాగంగా పలుమార్లు సర్జరీలు చేయించాల్సి వచ్చింది. ఈ పరిణామం మానసికంగా, శారీరకంగా బాధించింది. అయితే ఇప్పుడు నేను కోలుకున్నాను. నేను ఎంతగానో ఇష్టపడే సినిమాల్లో నటించాలి అనుకుంటున్నాను. మీ ప్రేమ, అభిమానాలతో నేను రికవరీ అయ్యాను. నా ఆరోగ్యం ప్రస్తుతం కుదురుకుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నేను సిద్ధంగా ఉన్నాను 2023...' అని ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.