గాయం కారణంగా మానసిక, శారీరక ఒత్తిడికి గురయ్యానని నభా సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. నభా పరిస్థితి తెలుసుకున్న ఫ్యాన్స్ బాధపడ్డారు. ఆమె కమ్ బ్యాక్ కావాలని తిరిగి సినిమాల్లో నటించాలని కోరుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో చిత్రాలు లేవు. 2021లో విడుదలైన మ్యాస్ట్రో మూవీ తర్వాత ఆమె కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. నితిన్ హీరోగా తెరకెక్కిన మ్యాస్ట్రో హాట్ స్టార్ లో నేరుగా విడుదల చేశారు.