మిల్క్ బ్యూటీ ఇంతలా మెరిసిపోతోందేంటీ.. అచ్చం పాలరాతి బొమ్మె.. సింగపూర్ లో స్టార్ బ్యూటీ రచ్చ..

First Published | Mar 20, 2023, 3:31 PM IST

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ తాజాగా మిల్కీ బ్యూటీ తన వేకేషన్ నుంచి పంచుకున్న ఫొటోలతో కనుల విందు చేసింది.
 

టాలీవుడ్ ను కొన్నేండ్ల పాటు ఊపూపిన మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతమూ అదే జోష్ ను కనబరుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. సీనియర్ హీరోయిన్ గా విభిన్న పాత్రలు పోషిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. 
 

ప్రస్తుతం తమన్నా భాటియా చేతి నిండా సినిమాలు ఉన్నాయి. సౌత్, నార్త్ తేడా లేకుండా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. ఓవైపు బడా హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ అలరిస్తోంది. 
 


ఇక బిజీ షెడ్యూల్ మధ్య కాస్తా రిలాక్స్ అయ్యేందుకు తాజాగా వేకేషన్ కోసం తమన్నా సింగపూర్ కు వెళ్లింది. ఈ సందర్భంగా బ్యూటీఫుల్ లోకేషన్స్ లో స్టార్ హీరోయిన్ స్టన్నింగ్ ఫోజులతో ఆకట్టుకుంటోంది. కొద్దిసేపటి కింద ఆ ఫొటోలను అభిమానులతోనూ పంచుకుంది.
 

తమన్నా షేర్ చేసిన పిక్స్ లో మిల్క్ బ్యూటీ అచ్చం పాలరాతి బొమ్మలానే ఉంది. ముట్టుకుంటే మాసిపోయే అందంతో నెటిజన్ల గుండెల్ని కొల్లగొట్టింది. స్లీవ్ లెస్ టాప్ లో అందాలను విందు చేసింది. సూర్య రష్మితోనే తమన్నా స్కిన్ టోన్ కలర్ పోటీపడుతుంది. ఈ బ్యూటీఫుల్ ఫొటోలను చూస్తే మైమరిచిపోవడం ఖాయమంటున్నారు. 
 

వేకేషన్ లో భాగంగా ఓ స్టార్ హోటలో దిగింది. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ.. హెల్తీ ఫ్రూట్స్ తోపాటు తనకిష్టమైన పైనాపిల్ ఫ్రూట్ తీసుకున్నట్టు ఫొటోలను షేర్ చేసింది. అలాగే స్విమ్మింగ్ పూల్ లో పింక్ బికినీలో ఈదుతూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. ఏదేమైనా వెకేషన్ ఫొటోలను ఫ్యాన్స్ తో పంచుకోవడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. లైక్స్, కామెంటతో వైరల్ చేస్తున్నారు. 

గతేడాది నాలుగైదు చిత్రాలతో అలరించిన తమన్నా.. ఈ ఏడాది కూడా అదే తరహాలో ఆకట్టుకోబోతోంది. ప్రస్తుతం చిరు సరసన ‘భోళా శంకర్’, రజినీకాంత్ సరసన ‘జైలర్’లో నటిస్తోంది. అలాగే మలయాళంలో ‘బంద్ర’, తమిళంలో ‘ఆర్మానీ 4’లో నటిస్తోంది. అలాగే హిందీలో ఇప్పటికే ‘బోలే చుడియాన్’ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. 
 

Latest Videos

click me!