హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీలో కాజల్ ఆరతి పాత్రలో నటించారు.గ్యాంగ్‌స్టర్ దాస్ రోల్ ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్ చేశారు. ఆరతితో పాటు పని చేసే పోలీసులుగా సీనియర్ నటి ఊర్వశి, సత్యన్ కనిపించనున్నారు. పోలీస్ కథకు, దర్శకుడు కావాలని ప్రయత్నించే యోగిబాబు పాత్రకు సంబంధం ఏమిటి? మధ్యలో మానసిక వికలాంగులకు సంబంధించిన ఆస్పత్రికి యోగిబాబు ఎందుకు వెళ్లారు? అనేది ఆసక్తికరం. సినిమాలో రిడిన్ కింగ్ స్లే, తంగదొరై, జగన్, ఊర్వశి, సత్యన్, ఆడు కాలం నరేన్, మనోబాల, రాజేంద్రన్, సంతాన భారతి, దేవదర్శిని నటించారు.