Happy Onam: ఓనమ్ పండుగ వేళ ఏంజెల్ లా మెరిసిన నభా నటేష్.. ఇస్మార్ట్ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ వైరల్ 

Published : Aug 29, 2023, 08:07 PM IST

ఓనమ్ పండుగ వేళ సాంప్రదాయ కట్టులో మనసులు దోచేసింది నభా నటేష్. బంగారు అంచు తెల్ల చీరలో గుండెల్లో పాగా వేసింది.   

PREV
16
Happy Onam: ఓనమ్ పండుగ వేళ ఏంజెల్ లా మెరిసిన నభా నటేష్.. ఇస్మార్ట్ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ వైరల్ 
Nabha Natesh

నేడు ఓనమ్(Onam 2023)పండుగ కాగా పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. ఒక సౌత్ ఇండియా స్టార్స్ తమ ఓనమ్ వేడుకల ఫోటోలు అభిమానులతో పంచుకుంటున్నారు. ఓనమ్ పండుగ వేళ బంగారు అంచు తెల్ల చీర కట్టడం సాంప్రదాయం . హీరోయిన్ నభా నటేష్ సైతం సదరు ఆచారం పాటించింది. నభా నటేష్ ఓనమ్ లుక్ మెస్మరైజ్ చేస్తుంది. అమ్మడు ఏంజెల్ వలె మెరిశారు. ఆమె అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. పండుగ శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే బ్యూటిఫుల్ గా ఉన్నారంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 
 

26
Nabha Natesh

ఇక నభా (Nabha Natesh)కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. 2021లో విడుదలైన మ్యాస్ట్రో మూవీ తర్వాత ఆమె కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. నితిన్ హీరోగా తెరకెక్కిన మ్యాస్ట్రో హాట్ స్టార్ లో నేరుగా విడుదల చేశారు. దాంతో అది ఆమెకు కెరీర్ కి ఉపయోగపడలేదు. 

 

36
Nabha Natesh

అయితే గ్యాప్ రావడానికి అనారోగ్య సమస్యలే కారణమంటూ ఆ మధ్య నభా నటేష్ వివరణ ఇచ్చారు. నభా నటేష్ ప్రమాదం బారిన పడ్డారట. ఆ ప్రమాదంలో నభా ఎడమ భుజం ఫ్రాక్చర్ అయ్యిందట. దానికి పలు సర్జరీలు జరిగాయట. కోలుకునే సమయంలో మానసికంగా శారీరకంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. 

46
Nabha Natesh

ఇక నభా కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ మూవీగా ఉంది. 2019లో విడుదలైన ఈ చిత్రం రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రామ్ హీరోగా విడుదలైన ఇస్మార్ట్ శంకర్ అందరికీ ఊపిరి పోసింది. 

56
Nabha Natesh

ఇస్మార్ట్ శంకర్ మూవీతో వచ్చిన ఆనందం ఆమెకు ఎంతో కాలం నిలవలేదు. అనేక అంచనాల మధ్య విడుదలైన డిస్కో రాజా దారుణమైన ఫలితం అందుకుంది. ఇక సోలో బ్రతుకే సో బెటర్ యావరేజ్ టాక్ తెచ్చుకోగా సంక్రాంతి రిలీజ్ అల్లుడు అదుర్స్ ప్లాప్ ఖాతాలో చేరిపోయింది. 

 

66
Nabha Natesh


కనీసం టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. ఐరన్ లెగ్ ఇమేజ్ వస్తే పోగొట్టుకోవడం కష్టం. హిట్ చుట్టూ తిరిగే పరిశ్రమలో ఇన్ని ప్లాప్స్ తో నెట్టుకు రావడం కష్టమే. తెలుగులో నభా నటేష్ జోరు తగ్గగా... కృతి శెట్టి, శ్రీలీల దూసుకుపోతున్నారు. ముఖ్యంగా శ్రీలీల క్రేజీ ఆఫర్స్ తో సత్తా చాటుతుంది.

click me!

Recommended Stories