ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేలా హీరోయిన్ ట్వీట్స్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరాదు, ట్రోలింగ్

Published : Apr 10, 2022, 06:51 AM IST

ఆర్ఆర్ఆర్ చిత్రం చూసిన వారు ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి నటనని ప్రశంసిస్తున్నారు. కానీ ఓ క్రేజీ బ్యూటీ మాత్రం ఎన్టీఆర్ అభిమానులని రెచ్చగొటే విధంగా ట్వీట్స్ చేస్తోంది. 

PREV
17
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేలా హీరోయిన్ ట్వీట్స్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరాదు, ట్రోలింగ్
meera chopra

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్ర జోరు బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం తగ్గడం లేదు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం టాలీవుడ్ లో నయా ఇండస్ట్రీ హిట్ గా అవతరించింది. అల్లూరి, కొమరం భీం పాత్రల్లో రాంచరణ్, ఎన్టీఆర్ చెలరేగి నటించారు. వీళ్లిద్దరి నటన థియేటర్స్ లో ప్రేక్షకులని కట్టి పడేసే విధంగా ఉంది. 

27
meera chopra

ఆర్ఆర్ఆర్ చిత్రంపై సెలెబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో మరో ఇద్దరు సౌత్ స్టార్లు పాన్ ఇండియా స్టార్స్ గా అవతరించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం చూసిన వారు ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి నటనని ప్రశంసిస్తున్నారు. కానీ ఓ క్రేజీ బ్యూటీ మాత్రం ఎన్టీఆర్ అభిమానులని రెచ్చగొటే విధంగా ట్వీట్స్ చేస్తోంది. 

37
meera chopra

ఆమె మరెవరో కాదు వాన, బంగారం చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా. ఆర్ఆర్ఆర్ చిత్రం చూశాక మీరా చోప్రా ట్వీట్ చేస్తూ.. కేవలం రాంచరణ్ పేరు మాత్రమే ప్రస్తావించింది. రాంచరణ్ హ్యస్ ట్యాగ్ పెట్టి లవ్ ఎమోజిలని పోస్ట్ చేసింది. ఎన్టీఆర్ పేరు ప్రస్తావించలేదు. 

47
meera chopra

ఎన్టీఆర్ అభిమానులని రెచ్చగొట్టేలా మరో ట్విట్ చేసింది. ఈ ట్వీట్ లో కూడా ఎన్టీఆర్ పేరు మెన్షన్ చేయలేదు. సౌత్ ఇండియా నటులు పాన్ ఇండియా స్టార్స్ గా ఎదుగుతుండడం చాలా సంతోషంగా ఉంది. వారి ప్రతిభ, వినయం, అభిరుచి చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అంటూ ప్రభాస్, అల్లు అర్జున్, రాంచరణ్, యష్ ల పేర్లు పోస్ట్ చేసింది. ఎన్టీఆర్ ఊసే ఎత్తలేదు. 

57
meera chopra

దీనితో ఎన్టీఆర్ అభిమానులు మీరా చోప్రాపై మండిపడుతున్నారు. ట్రోలింగ్ తో విరుచుకుపడుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్స్ దీపికా [పదుకొనె లాంటి వాళ్ళు ఎన్టీఆర్ తో నటించాలని కోరుకుంటున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరానివాళ్లకు అటెన్షన్ ఇవ్వొద్దు అంటూ ఎన్టీఆర్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. 

67
meera chopra

గతంలో ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం మీరా చోప్రా కోల్పోయింది అని.. ఆ బాధతోనే ఎన్టీఆర్ పై నెగిటివిటి స్ప్రెడ్ చేస్తోంది అని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. గతంలో కూడా ఎన్టీఆర్ విషయంలో మీరా చోప్రా మీద ట్రోలింగ్ జరిగింది. 

77
meera chopra

కెరీర్ ఆరంభంలో మీరా చోప్రా వాన, బంగారం లాంటి చిత్రాలతో మంచి ట్రాక్ లోనే కనిపించింది. కొన్ని చిత్రాల్లో గ్లామర్ గా కూడా కనిపించింది. కానీ సరైన సక్సెస్ లేకపోవడంతో ఆమె టాలీవుడ్ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం మీరా చోప్రాకి అర కొర అవకాశాలు మాత్రమే వస్తున్నాయి. 

click me!

Recommended Stories