జూన్ 9న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ నాగబాబు నివాసంలో జరిగింది. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు.చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొన్నారు. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించారు.