ప్రియుడ్ని పరిచయం చేసిన కృతి కర్బంద, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో

Published : Feb 17, 2023, 09:43 PM IST

చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న హీరోయిన్ కృతి కర్బంద తన ప్రియున్ని అఫీషియల్ గా పరిచయం చేసింది. తన ఇన్ స్టా పేజ్ లో ప్రేమికుడితో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది బ్యూటీ. 

PREV
16
ప్రియుడ్ని పరిచయం చేసిన కృతి కర్బంద, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్ళి పీటలు ఎక్కుతున్నారు. బాలీవుడ్ నుంచి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకూ చాలా మంది ఇప్పటికే చాలా మందికి పెళ్లిళ్లు అవుతుండగా.. పెళ్లికి రెడీ అయిన యంగ్ స్టార్స్ కూడా చాలా మంది ఉన్నారు. మరికొంత మంది మాత్రం తమ ప్రేమికులను సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు చేస్తున్నారు.  ఈక్రమంలో సీనియర్ హీరోయిన్ కృతి కర్బంద కూడా తన ప్రియుడిని పరిచయం చేసింది. 
 

26

కృతి కర్బంద చాలా కాలంగా ఓ హీరోతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తూనే ఉండగా.. వాటిని నిజం చేస్తూ..  ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.  బాలీవుడ్ యంగ్ స్టార్  పులికిత్ సామ్రాట్ తో కొంతకాలంగా క్లోజ్ గా మూవ్ అవుతుంది కృతి. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వీరి బంధం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉండగా.. తాజాగా వాటికి బలం చేకూర్చింది కృతి కర్బంద. 

36

రీసెంట్ గా ప్రేమికుల రోజున  తన ప్రేమను బయటకు చెప్పింది హీరోయిన్ . వీరిద్దరూ దిగిన ఫోటోను షేర్ చేసిన కృతి హ్యాపీ వాలంటైన్స్ డే అంటూ రాసింది. అయితే పులకిత్ కు గతంలోనే పెళ్ళి జరిగింది. కాని  వివాహం జరిగిన ఏడాదికే వారిద్దరు విడిపోయారు. ఇక వీరిద్దరు  చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుండటంతో.. ఈ జంట కూడా త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దీనిపై వీరిద్దరూ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
 

46

కృతి కర్బంద. 2009లో బోణీ సినిమాతో టాలీవుడ్ కు  పరిచయమైంది. ఆ తర్వాత తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త లాంటి సినిమాల్లో వరుసగా నటించింది. గ్లామర్..  నటన ఉన్నా.. టైమ్ బాగోలేక సక్సెస్ లు అందుకోలేకపోయింది కృతి. టాలీవుడ్ తరువాత కన్నడలో కూడా తన లక్ ను పరీక్షించుకుంది కృతీ కర్బంద. శాండిల్ ఉడ్ లో.. స్టార్ హీరోయిన్ హోదాను సాధించింది.  
 

56

చాలా కాలం తరువాత 2016లో తెలుగులో రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమాలో హీరోకి అక్కగా నటించిన  ఢిల్లీ భామ. అయితే ఈ సినిమా కూడా ఫెయిల్ అవ్వడంతో ఇక టాలీవుడ్ ను వదిలేసింది బ్యూటీ. బాలీవుడ్ లో మాత్రం మంచి మంచి సినిమాల్లో మెరిసింది బ్యూటీ.  హౌస్ ఫుల్ 4, పాగల్ పంటి, 14 ఫెహరే వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. 

66
Kriti Kharbanda

రీసెంట్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా పెళ్ళి పీటలు ఎక్కుతున్నారు.  డిసెంబర్ లో హన్సిక మొత్వాని పెళ్లి పీటలు ఎక్కగా.. ఆ తర్వాత అతియా శెట్టి మూడు ముళ్ళు వేయించుకుంది.. ఇక  ఈ ఫిబ్రవరిలో కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మరో వైపు తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లాంటివారు తాము చేసుకోబోయేవారిని పరిచయం చేస్తూ వస్తున్నారు.  మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 

click me!

Recommended Stories