Kiara Advani
హీరోయిన్లు అంటేనే మంచి మంచి కలర్ ఫుల్ డ్రస్సులతో.. ఆడియన్స్ ను అలరిస్తుంటారు. ఇన్ స్టాలో వాళ్ళు చేసే హాట్ షోలకు ఫిదా అవుతుంటారు ఫ్యాన్స్.. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు తమ అందం కోసం ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. వాళ్ల వస్తువలకు కూడా భారీగా ఖర్చు చేస్తుంటారు. ఈక్రమంలో కియారా అద్వాని కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. ఆమె ఎక్కువగాబ్యాక్ లకు ఖర్చు చేస్తుంటారు.
Image: Kiara Advani Instagram
బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదిగి..స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతోంది బ్యూటీ. అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తోంది బ్యూటీ. ప్రస్తుతం టాలీవుడ్ లో రామ్ చరణ్ జోడీగా .. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్ లో నటిస్తోంది కియారా అద్వాని.
కియారా కలెక్షన్ లో ఎక్కువగా బ్యాగ్స్ ఉంటాయి. ఆమెకు కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. తాజాగా ఆమె దాదాపు 4 లక్షలు విలువ చేసే బ్యాగ్ తో దర్శనం ఇచ్చింది. తన భర్త సిద్దార్ధ్ మల్హోత్రాతో కలిసి షికారుకు బయలు దేరింది కియారా. ముంబయ్ ని వరదలు ముంచెత్తుతుంటే.. కియారా మాత్రం... ఇంట్లో ఉండాలి అనుకోవడం లేదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇంతకు ముందు కియారా బ్యాగ్ ల కలెక్షన్స్ లో కూడా లక్షలు విలువ చేసే హ్యాండ్ బాగ్స్ ఉన్నాయి. ప్రస్తుతం కియారా వరుస సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రతో చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈబ్యూటీ.. ఈ ఏడాది పిబ్రవరిలో పెళ్ళాడింది. రాజస్థాన్ లో వీరి పెళ్ళి ఘనంగా జరిగింది.
అటు సినిమాలు చేస్తూ.. ఇటు భర్తతో కలిసి షికార్లు చేస్తోంది చిన్నది. షూటింగ్స్ నుంచి బ్రేక్ దొరికితే చాలు నచ్చిన ప్లేస్ కు వెళ్ళి హ్యాపీగా గడిపేస్తున్నారు కొత్త జంట. ఈక్రమంలోనే తాజాగా కియారా, సిద్దార్ధ్ జంట ముంబయ్ ఏయిర్ పోర్ట్ లో సందడి చేశారు.