Kajal Aggarwal: రెండోసారి గర్భం దాల్చిన కాజల్ అగర్వాల్... దీంతో ఊహించని నిర్ణయం?

Published : Jun 15, 2023, 12:46 PM IST

హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరోసారి తల్లి అయ్యారనే వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ క్రమంలో ఆమె అనూహ్య నిర్ణయం తీసుకున్నారట.   

PREV
15
Kajal Aggarwal: రెండోసారి గర్భం దాల్చిన కాజల్ అగర్వాల్... దీంతో ఊహించని నిర్ణయం?
Kajal Aggarwal

కెరీర్ స్వింగ్ లో ఉండగానే కాజల్ వివాహం చేసుకున్నారు. 2020 అక్టోబర్ నెలలో కాజల్ తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్నారు. 2022 ఏప్రిల్ నెలలో వీరికి ఒక అబ్బాయి పుట్టాడు. పేరు నీల్ కిచ్లు. అయితే ఆమె మరోసారి తల్లి అయ్యారంటూ ప్రచారం జరుగుతుంది. 
 

25


కాజల్ రెండోసారి గర్భం దాల్చారని, ఇకపై ఆమె పూర్తిగా నటనకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారనేది లేటెస్ట్ న్యూస్. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రముఖంగా ప్రచారం అవుతుండగా కాజల్ స్పందిస్తారేమో చూడాలి. కాగా కాజల్  సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. పెళ్ళికి ముందు ఒప్పుకున్న భారతీయుడు 2 మూవీ పూర్తి చేస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

35

కాజల్ చేతిలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ భగవంత్ కేసరి.  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ దసరా కానుకగా విడుదల కానుంది. ఈ మేరకు యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. కెరీర్లో ఫస్ట్ టైం ఆమె బాలయ్యతో జతకడుతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక రోల్ చేస్తుంది.

45

ఇటీవల కాజల్ బాలీవుడ్ మీద ఆరోపణలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో విలువలు, నైతికత లేదన్నారు. నేను ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ సౌత్ పరిశ్రమ ఆదరించింది అన్నారు. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమల్లో మంచి వాతావరణం ఉంది. అందుకే అక్కడ గొప్ప చిత్రాలు, నటులు, టెక్నిషియన్స్ తయారవుతున్నారని అన్నారు. మరో హీరోయిన్ ప్రియాంక చోప్రా సైతం ఇదే అభిప్రాయం వెల్లడించారు. 

 

55


లక్ష్మీ కళ్యాణం మూవీతో కాజల్ అగర్వాల్ హీరోయిన్ అయ్యారు. దర్శకుడు తేజా ఆమెను పరిశ్రమకు పరిచయం చేశారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం అంతగా ఆడలేదు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ మూవీతో మొదటి హిట్ అందుకుంది. మగధీర మూవీతో స్టార్ హీరోయిన్ అయ్యారు. చిరంజీవి కాజల్ ని వద్దని అన్నారట. చిరంజీవిని రాజమౌళి కన్విన్స్ చేసి కాజల్ కి మగధీర ఛాన్స్ ఇచ్చాడట. అక్కడ నుండి కాజల్ వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. 
 

click me!

Recommended Stories