ఇటీవల కాజల్ బాలీవుడ్ మీద ఆరోపణలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో విలువలు, నైతికత లేదన్నారు. నేను ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ సౌత్ పరిశ్రమ ఆదరించింది అన్నారు. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమల్లో మంచి వాతావరణం ఉంది. అందుకే అక్కడ గొప్ప చిత్రాలు, నటులు, టెక్నిషియన్స్ తయారవుతున్నారని అన్నారు. మరో హీరోయిన్ ప్రియాంక చోప్రా సైతం ఇదే అభిప్రాయం వెల్లడించారు.