Faria Abdullah: మేకప్ లెస్ లుక్ లో షాక్ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా... సహజ అందాలకు ఫ్యాన్స్ ఫిదా!

Published : Sep 13, 2023, 07:11 PM IST

ఫరియా అబ్దుల్లా మేకప్ లేకుండా కెమెరా ముందుకు వచ్చారు. తన అసలైన సహజ అందాలు పరిచయం చేసింది. ఫరియా మేకప్ లెస్ లుక్ వైరల్ అవుతుంది.   

PREV
18
Faria Abdullah: మేకప్ లెస్ లుక్ లో షాక్ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా... సహజ అందాలకు ఫ్యాన్స్ ఫిదా!
Faria Abdullah

సెలెబ్స్ ముఖానికి రంగు లేకుండా పబ్లిక్ లోకి వచ్చేందుకు ఇష్టపడరు. మేకప్ లెస్ ఫోటోలు షేర్ చేయరు. ఫరియా అబ్దుల్లా మాత్రం తన సహజ అందాలు పరిచయం చేసింది. మేకప్ లేకుండా కనిపించి మెస్మరైజ్ చేసింది. ఫరియా ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. 


 

28
Faria Abdullah

టాలెంట్ ఉన్నా ఫరియాకు (Faria Abdullah)బ్రేక్ రావడం లేదు. ప్రొఫెషనల్ డాన్సర్ అయిన ఫరియా తన స్టెప్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. కమర్షియల్ చిత్రాల్లో మాస్ రోల్ చేసే ఛాన్స్ వస్తే సాంగ్స్ లో ఇరగదీయాలని ఆశపడుతోంది. కానీ ఆమెకు ఆ తరహా ఆఫర్స్ రావడం లేదు. ఆమె డెబ్యూ మూవీ జాతి రత్నాలు చిత్రం భారీ విజయం సాధించినప్పటికీ తర్వాత ఆమెకు మరో హిట్ పడలేదు. 

38
Faria Abdullah

హైదరాబాద్ భామ ఫరియాకు అనుదీప్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు చిత్రంతో ఫరియా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు చేయగా ఫరియా హీరోయిన్ రోల్ చేశారు.

 

48
Faria Abdullah

జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ కొట్టింది. అత్యధిక లాభాలు పంచిన టాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక చిట్టి పాత్రలో ఫరియా ఒదిగిపోయి నటించింది. ఇన్నోసెంట్ లాయర్ గా, లవర్ గా నవ్వులు పూయించింది. జాతిరత్నాలు ఫరియాకు కొంత ఫేమ్ తెచ్చిపెట్టింది. కానీ జాతిరత్నాలు సక్సెస్ రేంజ్ లో ఆఫర్స్ రాలేదు. 
 

58


మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో ఫరియా చిన్న క్యామియో రోల్ చేశారు.  హీరో పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన అమ్మాయి పాత్రలో తళుక్కున మెరిశారు. అనంతరం బంగార్రాజు మూవీలో ఐటెం సాంగ్ చేశారు. సంతోష్ శోభన్ కి జంటగా నటించిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ కనీస ఆదరణ దక్కించుకోలేదు. 

 

68

ఫరియా హీరోయిన్ గా రావణాసుర చిత్రంలో నటించారు. రవితేజ హీరోగా దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నిరాశపరిచింది. ఈ మూవీపై ఫరియా చాలా ఆశలే పెట్టుకున్నారు. 

78
Faria Abdullah


ప్రస్తుతం ఫరియా చేతిలో ఓ చిత్రం ఉంది. కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. సోషల్ మీడియా వేదికగా తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఫరియా డాన్స్ వీడియోలకు భలే డిమాండ్ ఉంది. అలాగే బోల్డ్ ఫోటో షూట్స్ కి వెనుకాడటం లేదు. 
 

88

సినిమాల పరంగా కాస్తా వెనకబడే ఉన్న ఫరియా ఆయా ఈవెంట్లకు హాజరవుతూ సందడి చేస్తోంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ లుక్స్ లో ఫొటోషూట్లు చేస్తూ ఆకర్షిస్తోంది. మరోవైపు ఫరియా తన డాన్స్  రీల్స్ తోనూ ఆకట్టుకుంది. వరుసగా రీల్స్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. 


 

click me!

Recommended Stories