ఈ క్రమంలో బందిపోటు, ఓయ్, అమీ తుమీ, దర్శకుడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈషాకు భారీ కమర్షియల్ హిట్ పడకపోవడం మైనస్ అయ్యింది.ప్రస్తుతం ఈషాకు తెలుగులో ఫేమ్ తగ్గింది. దీంతో పర భాషల్లో సక్సెస్ కావాలని చూస్తున్నారు. కట్టిపడేసే అందం, నటన ఉండి కూడా లక్ అనేది ఈషాకు చిక్కలేదు. అందుకే ఆమె రేసులో వెనుకబడిపోయింది. దీనికి వివక్ష కూడా ఒక కారణం. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి బాలీవుడ్ భామలను తెచ్చుకుంటారు కానీ లోకల్ టాలెంట్ ని గుర్తించరు.