తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయిన బిందు మాధవి... టాలీవుడో లో స్టార్డమ్ కాని.. హీరోయిన్ గా మంచి కెరీర్ ను కాని సాధించలేకపోయింది. ఇక ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో.. ఇక మకాం తమిళ్ కు మార్చేసింది. కోలీవుడ్ లో కాస్తో కూస్తో హీరోయిన్ గా పర్వాలేదు అనిపించింది. అయితే లవ్ బ్రేకప్ కారణంగా అక్కడ కూడా తన యాక్టింగ్ కెరీర్ కి బ్రేక్ ఇచ్చింది బిందు మాధవి. బిగ్ బాస్ ఓటీటీ తెలుగు సీజన్ విన్నర్ అయిన తర్వాత బిందు మాధవి కెరీర్ మళ్లీ పట్టాలెక్కింది.