ప్రస్తుతం అనుపమ ఆనందానికి హద్దులు లేవు. ఏకంగా వంద కోట్ల హిట్ కొట్టేసింది. కెరీర్ ముగుస్తుందన్న దశలో ఇంత భారీ హిట్ పడటం నిజంగా గొప్ప విషయం. నిఖిల్ హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 వంద కోట్ల మార్క్ దాటేసినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి.
27
Anupama Parameswaran
ఇక హిందీలో ఈ మూవీ విజయం సాధించడం మరో విశేషం. పెద్ద హీరోల చిత్రాలకు షాక్ ఇస్తూ కార్తికేయ 2 ఊహించిన వసూళ్లురాబట్టింది. కార్తికేయ 2 దాదాపు రూ. 30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఈ విజయాన్ని టీమ్ భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు .
37
Anupama Parameswaran
సోషల్ మీడియాలో అనుపమ ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తెలుగులో మంచి ఆఫర్స్ తలుపుతడతాయని ఆమె అంచనా వేస్తున్నారు. వెంటనే నిఖిల్ తో అనుపమ మరో మూవీ చేస్తుంది. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ 18 పేజెస్ టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. 18 పేజెస్ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది.
47
Anupama Parameswaran
తాజాగా డీజే టిల్లు సీక్వెల్ హీరోయిన్ గా అనుపమ ఎంపికయ్యారు. డీజే స్క్వేర్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. డీజే టిల్లుతో అదరగొట్టిన సిద్దు జొన్నలగడ్డ సీక్వెల్ లో మరింత అదరగొట్టనున్నారు.
57
Anupama Parameswaran
డీజే టిల్లు స్క్వేర్ తో పాటు బటర్ ఫ్లై టైటిల్ తో తెరకెక్కుతున్న తెలుగు మూవీ చేస్తున్నారు. మొత్తంగా మూడు తెలుగు చిత్రాలు, ఒక మలయాళం, ఒక తమిళ చిత్రంలో అనుపమ నటిస్తున్నారు.
67
Anupama Parameswaran
ఇక వెండితెరపై హోమ్లీ రోల్స్ చేసే అనుపమ సోషల్ మీడియాలో మాత్రం హద్దులు దాటేస్తున్నారు. అందరిలానే తాను కూడా హాట్ ఫోటో షూట్స్ చేయడానికి వెనకాడటం లేదు.
77
Anupama Parameswaran
రౌడీ బాయ్స్ మూవీలో అనుపమ రెచ్చిపోయి నటించింది. లిప్ లాక్ సన్నివేశాల్లో మొహమాటం లేకుండా పాల్గొన్నారు. అనుపమ అలాంటి సన్నివేశాల్లో నటించడానికి ప్రేక్షకులు ప్రముఖంగా చెప్పుకున్నారు. ఫేడ్ అవుట్ కానుంది అనుకుంటున్న తరుణంలో అనుపమకు కాలం కలిసొచ్చి వరుస ఆఫర్స్ దక్కాయి.