థాయిలాండ్ స్ట్రీట్ లో అంజలి అల్లరి, బ్యాంకాక్ లో ఎంజాయ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ బ్యూటీ..

Published : Oct 01, 2023, 10:24 AM IST

ఎప్పుడూ సినిమాలు షూటింగ్ లేనా.. అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వాలి కదా.. అందుకే బ్యాంకాక్ వెళ్ళింది హీరోయిన్ అంజలి. అక్కడి వీధుల్లో సామాన్య టూరిస్ట్ లా సందడి చేస్తోంది.   

PREV
17
థాయిలాండ్ స్ట్రీట్ లో అంజలి అల్లరి, బ్యాంకాక్ లో ఎంజాయ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ బ్యూటీ..

అటు హీరోయిన్ గా.. ఇటు గ్లామర్ క్యారెక్టర్ రోల్స్ చేస్తూ.. కెరీర్ ను బిజీగా గడిపేస్తోంది తెలుగు పిల్ల అంజలి. చెన్నై నగరాన్ని దాటి.. థాయిలాండ్ వీధుల్లో సందడి చేస్తోంది  బ్యూటీ. తాజాగా తన ఫారెన్ టూర్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

27

ఫ్యాషన్ వేర్ లో  హాట్ గా ఉంది అంజలి. బ్యాంకాక్ నగరానికి తగ్గట్టుగానే తన గెటప్ ను మార్చేసుకుంది. అలా వీధుల్లో డాన్స్ చేస్తున్న వయ్యారాలు పోతూ.. గొబ్బరి నీళ్లు తాగుతూ కనిపించింది. ఆ అందమైన టూరిస్ట్ స్పాట్ కే అందం తీసుకొచ్చింది అంజలి. 

37

ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది అంజలి. ఈసినిమాలో కీలకపాత్రలో ఆమె మెరవబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే షూటింగ్  దాదాపు కంప్లీట్ అవ్వగా.. ఒకటీ రెండు మేజర్ షెడ్యూల్స్ ఉన్నట్టు తెలుస్తోంది. 

47

తాజాగా రేర్ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది అంజలి. 50 సినిమాల అరుదైన మైలురాయిని దాటింది.సినీ ప్రయాణంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు, వివాదాలు, బాధలు, కష్టాలు..అన్నింటిని అధిగమించి  ప్రస్తుతం హాఫ్ సెంచరీ పూర్తి చేసింది అంజలి. 
 

57

ఇక తన అందంతో నటనతో అటు తమిళ ప్రేక్షకులతో పాటు.. ఇటు తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కూడా కదిలించింది బ్యూటీ. ఇక ఈ హీరోయిన్ ను ప్రతీ ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు..  మన పక్కింటి అమ్మాయిలా భావిస్తారు. 
 

67

కెరీర్ పీక్ లో ఉండగానే.. ఇబ్బందుల్లో పడింది అంజలి. పర్సనల్ ప్రాబ్లమ్స్ తో పాటు..ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో చాలా కాలం సినిమాలకు దూరం అయ్యింది.  హీరో జైతో పేమ ఆతరువాత బ్రేకప్ అవ్వడంతో.. కెరీర్ లో కొంత కాలం డిస్ట్రబ్ అయ్యింది. ఇక అంజలి పని అయిపోయింది అనుకున్న టైమ్ లో.. మళ్ళీ పుంజుకుని.. ఎదిగి తనను తాను నిరూపించుకుంది అంజలి. 

77

ప్రస్తుతం తనకు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టిన  గీతాంజలి సీక్వెల్ లో నటిస్తోంది అంజలి. తాజాగా ఈమూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. కొన వెంకట్ సమర్పణలో  తెరకెక్కుతోన్న ఈసినిమా  గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా యూనిట్ నుంచి విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈసారి మరింత భయపెట్టేందుకు రెడీ అవుతోంది అంజలి. 

click me!

Recommended Stories