హాఫ్ సెంచరీ కొట్టిన అంజలీ, అరుదైన రికార్డ్ సాధించిన తెలుగు బ్యూటీ

Published : May 31, 2023, 01:40 PM IST

అరుదైన మైలురాయిని దాటిది హీరోయిన్ అంజలి. తన సినీప్రయాణంలోఎన్నో ఒడిదుడుకులు, వివాదాలు, బాధలు, కష్టాలు..అన్నింటిని అధిగమించి  ప్రస్తుతం హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. 

PREV
17
హాఫ్ సెంచరీ కొట్టిన అంజలీ, అరుదైన రికార్డ్ సాధించిన తెలుగు బ్యూటీ

అందానికి అందం.. నటనకు నటన, మన పక్కింటి అమ్మాయిలా..  అచ్చ తెలుగు ఆడపడుచులా.. పద్దతిగా ఉంటుంది అంజలి. మాట, యాటీట్యూడ్ ఏమాత్రం ఎదుటివారిని నొన్పించేలా ఉండదు. ఇక ఈ బ్యూటీ తాజాగా 50  సినిమాల మైలురాయిని చేరుకుంది. హాఫ్ సెంచరీ సినిమాలు పూర్తి చేసి..అరుదైన రికార్డ్ సాధించింది.  
 

27

ఫొటో సినిమా  ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అంజలి. మన తెలుగులో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్లు గా ఛాన్స్ ఇవ్వరు కదా..? అందుకే వెంటనే తమిళపరిశ్రమలో అడుగు పెట్టి.. అక్కడ స్టార్ హీరోయిన్ గా  ఎదిగింది. అక్కడ ఎదుగుతూనే తెలుగు సినిమాలు కూడా చేస్తూ వచ్చింది బ్యూటీ.  

37

అంగాడి తెరు, ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌,  వంటి సినిమాలు తమిళనాట అంజలి కెరీర్ కు మలుపు తిప్పాయి. ఇటు తెలుగులో కూడా   సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. గీతాంజలి వకీల్‌ సాబ్‌ సినిమాలతో మెప్పించింది బ్యూటీ. అంజలి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 17 ఏళ్ళు అవుతోంది. ఇన్నేళ్లలో.. తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ సినిమాల్లో నటించి మెప్పించి.. ఆకట్టుకుంది బ్యూటీ.

47

ఇక తన వ్యాక్తి గత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసింది అంజలి. హీరో జైతో పేమ బ్రేకప్ అవ్వడంతో.. కెరీర్ లో కొంత కాలం డిస్ట్రబ్ అయ్యింది. ఇక అంజలి పని అయిపోయింది అనుకున్న టైమ్ లో.. మళ్ళీ పుంజుకుని.. ఎదిగి చూపించింది అంజలి. 

57

అంజలి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే కనిపిస్తుంది. తన వ్యక్తిగత విషయాలను సినిమా విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. రకరకాల పోటో షూట్లతో అలరించడంతో ఆమె తరువాతేఎవరైనా. అంత అద్భుతంగా..  బ్యూటిఫుల్ ఫోటోలతో తెలుగు భామ ఆకట్టుకుంటుంది. 

67

రామ్ చరణ్ ,శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాన్ఇండియా మూవీ గేమ్ చేంజర్'లో కీలక పాత్రలో అలరించబోతోంది అంజలి. తెలుగులో చివరిగా నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంలో స్పెషల్ డాన్స్ తో అంజలి ఆకట్టుకుంది. ఈసినిమాతో  అంజలి క్రేజ్ ఇంకాస్త పెరిగింది. రీసెంట్ గా తమిళంలో ఝాన్సీ వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది బ్యూటీ.  ప్రస్తుతం మరో వెబ్ సిరీస్ తో పాటు సినిమాల్లో నటిస్తోంది.

77

 తాజాగా అంజలి ఈగై అనే టైటిల్‌ తో సినిమా చేయబోతోంది. తమిళనాట  అశోక్‌ వేలాయుధం అనే వ్యక్తి దర్శకత్వం వహించబోతున్న ఈసినిమా.. అంజలికి 50వ సినిమా.  ఈ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభంకానుందని, కెరీర్‌లో యాభై చిత్రాలకు చేరుకోవడం ఎంతో ప్రత్యేక సందర్భమని హ్యాపీగా ఫీల్ అవుతూ చెపుతోంది అంజలి.

click me!

Recommended Stories