వీగన్ గా మారిన సమంత... సమంత బోల్డ్ డెసిషన్, సాధుజీవి జీవితం ఎలా గడుపుతుందో!

First Published Jun 6, 2021, 1:01 PM IST

పిట్ట కొంచెం కూత ఘనం.. అన్న సామెత హీరోయిన్ సమంతకు చక్కగా సరిపోతుంది. ఈ ఐదు అడుగుల చిన్నది వెండితెరను షేక్ చేస్తుంది. సమంత కెరీర్ లో సాధించిన బ్లాక్ బస్టర్ విజయాలు ఎన్నో.  సమంత నిర్ణయాలు కూడా చాలా సాహసోపేతంగా ఉంటాయి. 

స్టార్ హీరోల సినిమాలలో కమర్షియల్ రోల్స్ చేసిన సమంత, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న అనేక పాత్రలు చేశారు. పెళ్లి తరువాత కూడా సూపర్ డీలక్స్ లాంటి మూవీలో సమంత అలాంటి బోల్డ్ సీన్ లో నటించడం గొప్ప విషయమే.
undefined
కెరీర్ లో తిరుగులేని హైట్స్ అందుకున్న సమంత ఫిట్నెస్ పరంగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఆరోగ్యకరమైన పరిమిత ఆహారం తీసుకుంటారు. ప్రతిరోజూ యోగా, మెడిటేషన్, కసరత్తులు క్రమం తప్పకుండా చేస్తారు.
undefined
30 ప్లస్ కి చేరిన సమంత ఇంకా టీనేజ్ బేబీ తరహా గ్లామర్, బాడీ మైంటైన్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా సమంత లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఆహారం విషయంలో సమంత కఠిన నియమాలు పాటిస్తున్నారు.
undefined
తాజాగా సమంత వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే పురస్కరించుకొని ఫిక్కీ లేడీస్ ఫెడరేషన్ నిర్వహించిన వర్చువల్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత తన జీవన విధానం, ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
undefined
ముఖ్యంగా సమంత వీగన్ గా మారారు అట. ఆమె పూర్తిగా మాంసాహారం మానివేశారట. అలాగే  హైడ్రోఫోనిక్ పద్దతి ద్వారా ఆర్గానిక్ ఆహారం స్వయంగా పండించుకుంటున్నారట. ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో పుట్టిన నేను మాంసాహారం మానివేయడం అతిపెద్ద మార్పు అని సమంత తెలిపారు.
undefined
మాంసాహారంతో పాటు జంతుల ఉత్పతులైన పాలు, పాలపదార్ధాలను కూడా త్యజించి వారిని  వీగన్స్ అంటారు. జంతు ప్రేమికులు సాధారణంగా వీగన్స్ గా మారుతారు. సమంత కూడా వీగన్ మారి కక్కా ముక్కా కి దూరంగా ఉండనుంది.
undefined
ఇక సమంత నటించిన ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. లేడీ ఉగ్రవాదిగా సమంత నటన అద్భుతం అంటూ అందరూ కొనియాడుతున్నారు.
undefined
click me!