పెళ్ళైన హీరోపై క్రష్ అంటున్న సాయి పల్లవి... ఆ అవకాశం రావడంతో ఎగిరి గంతేసిందట!

First Published Feb 3, 2021, 2:43 PM IST

ప్రత్యేకమైన ఇమేజ్ కలిగిన సాయి పల్లవి తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అద్భుతమైన డాన్స్, నటన సొంతం చేసుకున్న సాయి పల్లవి క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. కోట్ల అభిమాన గణం కలిగిన సాయి పల్లవికి ఓ హీరో అంటే క్రష్ అట. 

సాయి పల్లవికి హీరో సూర్య అంటే ఎంతో ఇష్టమట.  చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూ పెరిగారట. ఎప్పటి నుండో హీరో సూర్యపై తనకు క్రష్ ఉండేదంటూ సాయి పల్లవి మనసులో మాట బయటపెట్టారు.
undefined
సాయి పల్లవి ఎన్ జి కె చిత్రంలో సూర్యకి జంటగా నటించారు. ఆ మూవీలో సాయి పల్లవి సూర్య భార్య పాత్ర చేశారు. తాము ఎంతగానో అభిమానించే సూర్య పక్కన అవకాశం రావడంతో, సాయి పల్లవి చాలా సంతోషంగా ఫీలయ్యారట.
undefined
ఇక సాయి పల్లవి కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె తెలుగు తమిళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తున్నారు. నాగ చైతన్యకు జంటగా ఆమె నటించిన లవ్ స్టోరీ విడుదలకు సిద్ధంగా ఉంది.
undefined
అలాగే రానాకి జంటగా విరాటపర్వం మూవీలో సాయి పల్లవి నటిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది.
undefined
ఈ పీరియాడిక్ డ్రామాలో సాయి పల్లవి 90ల నాటి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది.
undefined
వీటితో పాటు పవన్ కళ్యాణ్ కి జంటగా ఆమె అవకాశం దక్కించుకున్నారని వార్తలు వస్తున్నాయి.  అయ్యప్పనుమ్ కోశియుమ్ మూవీలో సాయి పల్లవి పవన్ భార్య రోల్ చేస్తున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.
undefined
ఇక నాని హీరోగా తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ చిత్రంలో కూడా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం.
undefined
ఎక్స్ పోజింగ్ కి ఆమడ దూరం ఉండే సాయి పల్లవి, సినిమాల ఎంపిక విషయంలో తెలివి చూపుతూ మంచి మంచి ఆఫర్స్ దక్కించుకుంటున్నారు.
undefined
click me!