మోనాల్-అఖిల్ హగ్గులతో, హారిక హాట్ స్టెప్పులతో... బిగ్ బాస్ ఉత్సవంలో దుమ్మురేపిన కంటెస్టెంట్స్!

First Published Feb 3, 2021, 1:55 PM IST

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఒకే వేదికపై సందడి చేశారు. డాన్స్ లతో, పంచ్ డైలాగ్స్ తో రచ్చ చేశారు. యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా సాగిన బిగ్ బాస్ ఉత్సవం ప్రోగ్రాం ప్రోమో దుమ్ము రేపగా... కార్యక్రమంపై ఆసక్తి కలుగుతుంది.

గత మూడు సీజన్ల మాదిరే బిగ్ బాస్ సీజన్ 4 సూపర్ సక్సెస్ అయ్యింది. అభిజీత్ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా టైటిల్ అందుకున్నాడు. ఇక అఖిల్ రన్నర్ గా నిలిచాడు. టాప్ ఫైవ్ కి సోహెల్, అరియనా మరియు హారిక వెళ్లడం జరిగింది.
undefined
కాగా ఈ సీజన్ లో దాదాపు పెద్దగా పరిచయం లేని వారు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అరియనా, అఖిల్, సోహైల్, హారిక, దివి, మెహబూబ్ లాంటి కంటెస్టెంట్స్ జనాలకు పరిచయం తక్కువే. యూట్యూబ్ ఫాలో అయ్యేవాళ్లకు మాత్రమే వీరి గురించి తెలుసు.
undefined
అయితే షో మొదలయ్యాక అందరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సోహెల్, అఖిల్, హారిక అరియనా, గంగవ్వ, మెహబూబ్, దివి లకు బిగ్ బాస్ షో మంచి గుర్తింపు తేవడమే కాకుండా, కెరీర్ ఎదుగుదలకు మంచి పునాది వేసింది.
undefined
సోహెల్ కి మూవీ ఆఫర్ రాగా, గంగవ్వ, మెహబూబ్ యూట్యూబ్ వీడియోలకు లక్షల వ్యూస్ దక్కుతున్నాయి. ఇక మోనాల్ కి వెండితెరపై మంచి మంచి ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం ఉంది.
undefined
కాగా స్టార్ మా బిగ్ బాస్ ఉత్సవం పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించింది. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న అందరు కంటెస్టెంట్స్ ని ఒక వేదికపైకి తీసుకువచ్చారు.
undefined
బిగ్ బాస్ ఉత్సవం ప్రోగ్రామ్ లో హారిక, మోనాల్, అఖిల్, అమ్మ రాజశేఖర్, దివి డాన్స్ లతో దుమ్ము రేపారు. ఇక లాస్య వేదికపైనే పప్పుతో అందరికీ అన్నం తినిపించారు.
undefined
పప్పు తిన్న అవినాష్ కడుపు పట్టుకొని బాత్రూమ్ కి పరుగెడుతున్నట్లు చేసిన కామెడీ నవ్వులు పూయించింది. బిగ్ బాస్ హౌస్ లో లాస్య చేసిన పప్పు తిని హౌస్ మేట్స్ కి మోషన్స్ అయిన విషయం తెలిసిందే.
undefined
మోనాల్, అఖిల్ ఈ కార్యక్రమంలో కూడా హగ్స్ ఇచ్చుకోవడం మానలేదు. అవకాశం దొరికినప్పుడల్లా అఖిల్ కి మోనాల్ హగ్గులు ఇవ్వడం జరిగింది.
undefined
హారిక, దివిలు సోలో పెర్ఫార్మన్స్ తో స్టేజిపై అదరగొట్టారు. నాటీ నాటీ గర్ల్ గర్ల్ అనే సాంగ్ కి హారిక హాట్ హాట్ స్టెప్స్ తో దుమ్ము రేపడం జరిగింది.
undefined
హౌస్ లో టీమ్ గా మెలిగిన నోయల్, అభిజీత్, హారిక మరియు లాస్య ప్రత్యేకంగా ఒకరిపై ఒకరు అభిమానం చాటుకున్నారు.
undefined
ఇక ఇక్కడ కూడా సోహెల్, అరియనా కొట్టుకోవడం ఆపలేదు. అరియనా యాటిట్యూడ్ దెబ్బకు తట్టుకోలేక మెహబూబ్ రారా అంటూ కేకలు వేశాడు సోహెల్.
undefined
ఫిబ్రవరి 7న ప్రసారం కానున్న బిగ్ బాస్ ఉత్సవం ప్రోమో వీడియో ఆకట్టుకోగా, కార్యక్రమంపై ఆసక్తి కలుగుతుంది.
undefined
click me!