స్లీవ్ లెస్ జాకెట్ లో సారంగ దరియా అందాలు... మొదటిసారి అలా చేసిన సాయి పల్లవి!

First Published Apr 4, 2021, 1:13 PM IST

ఈతరం పద్దతి గల హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు. సాయి పల్లవి ఎంచుకునే పాత్రలతో పాటు ఆమె వ్యక్తిత్వం కూడా చాలా విభిన్నం. ఎన్ని డబ్బులు ఆఫర్ చేసినా... సాయి పల్లవి స్కిన్ షో చేయదు. అలాగే ప్రాధాన్యం లేని సినిమాలు ఒప్పుకోదు. 
 

కమర్షియల్ ప్రకటనలకు కూడా సాయి పల్లవి చాలా దూరం. ఆ మధ్య ఓ ఫెయిర్నెస్ క్రీం కంపెనీ.. ప్రచార కర్తగా ఉండాలంటూ కోట్లు ఆఫర్ చేసినా, చేయనని తెగేసి చెప్పిందట అమ్మడు. నేను నమ్మని విషయాన్ని ప్రచారం చేయనని కుండబద్దలు కొట్టిందట.
undefined
సినిమా రెమ్యూనరేషన్ విషయంలో కూడా నిర్మాతలకు చాలా అనుకూలంగా ఉంటారట. ఓ సినిమా ప్లాప్ కావడంతో, నష్టాలపాలైన నిర్మాతకు పూర్తిగా రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిందట సాయి పల్లవి.
undefined
చెప్పుకుంటూ పోతే సాయి పల్లవి సుగుణాలు ఎన్నో ఉన్నాయి. అలాగే సాయి పల్లవి అసలు ఫోటో షూట్స్ చేయరు. ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ పరిశీలిస్తే.. కేవలం సహజంగా, కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు మాత్రమే ఉంటాయి.
undefined
బుల్లితెర యాంకర్స్ కూడా వరుస ఫోటో షూట్స్ చేస్తుండగా, సాయి పల్లవి మాత్రం వాటిపై అంతగా ఆసక్తి చూపదు. అయితే గతానికి భిన్నంగా సాయి పల్లవి ఓ ఫోటో షూట్ చేశారు. సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
undefined
స్కై బ్లూ శారీ, స్లీవ్ లెస్ జాకెట్ లో కొత్తగా కనిపించారు సాయి పల్లవి. స్లీవ్ లెస్ అవుట్ ఫిట్స్ అంతగా ఇష్టపడని సాయి పల్లవి, అలా మొదటిసారి కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యంగా ఫీలవుతున్నారు.
undefined
ఇక తెలుగులో సాయి పల్లవి లవ్ స్టోరీ, విరాటపర్వం చిత్రాలలో నటిస్తున్నారు. విరాట పర్వం మూవీలో నక్సలైట్ రానా ప్రేమలో పడే అమ్మాయిగా ఆమె పాత్ర ఉండనుంది. ఏప్రిల్ 30న ఈ చిత్రం విడుదల కానుంది.
undefined
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సైతం విడుదలకు సిద్ధమైంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్నారు.
undefined
లవ్ స్టోరీ చిత్రంలోని సారంగ దరియా సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సారంగ దరియా లిరికల్ సాంగ్ వీడియో అతి తక్కువ కాలంలో 100 మిల్లియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టి, రికార్డు నెలకొల్పింది.
undefined
click me!