Anushka Shetty: అనుష్క ఏంటీ ఇలా తయారయ్యారు... షాకింగ్ లుక్ లో స్వీటీ!

Published : Mar 28, 2022, 02:13 PM ISTUpdated : Mar 28, 2022, 02:19 PM IST

చాలా కాలం తర్వాత కెమెరా కంటికి చిక్కిన అనుష్క శెట్టిని చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మునుపటి కంటే డబుల్ వెయిట్ లో కనిపిస్తున్న ఆమె లుక్ జనాలకు మైండ్ బ్లాక్ చేసింది.   

PREV
17
Anushka Shetty: అనుష్క ఏంటీ ఇలా తయారయ్యారు... షాకింగ్ లుక్ లో స్వీటీ!
Anushka Shetty

 ఆరడుగుల అనుష్క(Anushka Shetty)... హైట్ కి తగ్గ వెయిట్ తో చాలా అందంగా ఉండేవారు. సూపర్ గ్లామర్ కలిగిన అనుష్క మంచి నటి కూడా కావడంతో స్టార్ హీరో రేంజ్ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అరుంధతి అనుష్కకు బ్రేక్ ఇవ్వగా... బిల్లా, మిర్చి వంటి చిత్రాలతో మరింత ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 
 

27
Anushka Shetty

బాహుబలి (Bahubali)మూవీతో దేశవ్యాప్తంగా పాప్యులర్ అయ్యారు. బాహుబలి సమయంలో ఆమె చేసిన ఓ మిస్టేక్ గ్లామర్ ని దెబ్బతీసింది. 2015లో బాహుబలి 1 విడుదల కాగా... బాహుబలి 2 షూటింగ్ స్టార్ట్ అయ్యే గ్యాప్ లో ఓ ప్రయోగాత్మక చిత్రం చేశారు. జీరో సైజ్ టైటిల్ తో తెరకెక్కిన ఆ మూవీ కోసం కావాలనే విపరీతంగా బరువు పెరిగారు. 
 

37
Anushka Shetty


పాత్ర సహజంగా ఉండడానికి భారీగా లావైన అనుష్క పూర్తిగా షేపవుట్ అయ్యారు. ఇంత రిస్క్ చేస్తే ఆ జీరో సైజ్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దానికి తోడు అనుష్క సన్నబడడం పెద్ద సమస్యగా మారింది. ఎంత శ్రమించినా అనుష్క మునుపటి వెయిట్, లుక్ లోకి రాలేకపోయారు. ఈలోపు బాహుబలి 2 షూటింగ్ షురూ అయ్యింది. అనుష్క లుక్ చూసిన రాజమౌళి ఫుల్ డిస్పాయింట్ అయ్యారు. 
 

47
Anushka Shetty

ఆమె తగ్గడానికి సమయం లేకపోవడంతో చేసేది లేక అలాగే ఆమెపై చిత్రీకరణ చేశారు. కాకపోతే కోట్లు ఖర్చుపెట్టి అనుష్కను సన్నగా చూపించారు. బాహుబలి బడ్జెట్ లో అనుష్క వెయిట్ అదనంగా చేరింది. బాహుబలి 2 వందల కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ కావడంతో.. అనుష్క చేసిన మిస్టేక్ సక్సెస్ లో కొట్టుకుపోయింది. 
 

57
Anushka Shetty

బాహుబలి 2 తర్వాత చాలా కస్టపడి అనుష్క కొంతలో కొంత బరువు తగ్గారు. స్వతహాగా యోగ గురు అయిన అనుష్క, కొందరు నిపుణుల సలహాతో వెయిట్ తగ్గారు. కాగా ఈమధ్య తక్కువగా సినిమాలు చేస్తున్న అనుష్క ఎక్కువగా ఇంటి వద్దే ఉంటున్నారు.ఈ గ్యాప్ లో అనుష్క మరలా వెయిట్ పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది.

67
Anushka Shetty


ఆర్ ఆర్ ఆర్ మూవీ (RRR Movie)సక్సెస్ నేపథ్యంలో మార్చి 27న చరణ్ బర్త్ డే ప్రత్యేకంగా జరిపారు. ఈ పార్టీకి అనుష్క కూడా హాజరయ్యారు. చాలా కాలం తర్వాత కెమెరా కంటికి చిక్కిన అనుష్క లుక్ షాక్ ఇచ్చింది. ఆమె చాలా లావుగా కనిపించారు. అనుష్క కెరీర్ కూడా ఫేడ్ అవుట్ దశకు చేరుకోగా ఆమె ఫిట్నెస్ పై అసలు కేర్ తీసుకోవడం లేదేమోననిపిస్తుంది. 
 

77
Anushka Shetty

అనుష్క నవీన్ పోలిశెట్టికి జంటగా ఓ మూవీ చేస్తున్నారు. ఇద్దరు ఏజ్ గ్యాప్ జంట మధ్య జరిగే రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు సమాచారం. మరి ఈ మూవీలో పాత్ర కోసం అనుష్క మరోసారి ఇలా బరువు పెరిగారేమో అనే డౌట్ కూడా కొడుతుంది. కారణం ఏదైనా ఒకప్పటి నాజూకు అనుష్కను చూసి ఇప్పుడు చూస్తుంటే ఫ్యాన్స్ కి కొంచెం బాధగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories