Ananya Pandey: మేకప్ లేకుండా కెమెరా ముందుకు... షాకిస్తున్న లైగర్ బ్యూటీ అనన్య పాండే లేటెస్ట్ ఫోటో షూట్

Published : Mar 16, 2022, 05:28 PM IST

యంగ్ బ్యూటీ అనన్య పాండే మేకప్ లెస్ లుక్ లో షాకిచ్చింది. అమ్మడు సహజ అందాలు చూసిన ఫ్యాన్స్ కిరాకెత్తి పోతున్నారు. ఎప్పుడూ సూపర్ హాట్ గ్లామరస్ గా కనిపించే బాలీవుడ్ భామ కొత్తగా కనిపించి ఆకట్టుకుంది.

PREV
16
Ananya Pandey: మేకప్ లేకుండా కెమెరా ముందుకు... షాకిస్తున్న లైగర్ బ్యూటీ అనన్య పాండే లేటెస్ట్ ఫోటో షూట్

స్టార్ కిడ్ అనన్య పాండే లేటెస్ట్ రిలీజ్ గెహరియాన్ (Gehraiyaan)టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇంటెన్స్, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన గెహరియాన్ మూవీలో దీపికా పదుకొనె (Deepika Padukone) మెయిన్ లీడ్ చేశారు. అనన్య పాండే మరో కీలక రోల్ చేయడం జరిగింది. ఈ సినిమా కోసం కొంచెం హద్దులు మీరు రొమాన్స్ కురిపించారు దీపికా, అనన్య పాండే.

26

ఇక లైగర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది. డైనమిక్ డైరెక్టర్ పూరి, రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. ఇక హీరోలతో పాటు హీరోయిన్స్ ని సరికొత్తగా ప్రజెంట్ చేయడంలో పూరి సిద్ధహస్తుడు. మరి ఈ యంగ్ బ్యూటీ అనన్య పాండేను ఎలా చూపిస్తారో చూడాలి. 
 

36

బాలీవుడ్ నటుడు చంకీ పాండే కూతురైన అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు పునీత్ మల్హోత్ర తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు.

46


అనంతరం, పతి పత్ని ఔర్ ఓహ్, కాలీ పీలీ చిత్రాలు చేశారు. ఇప్పుడిప్పుడే అనన్య బాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. లైగర్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. ఈ నేపథ్యంలో లైగర్ (Liger) విజయం సాధిస్తే అనన్యకు బ్రేక్ దక్కినట్లే.
 

56

కెరీర్ ఇలా ఉంటే... సోషల్ మీడియాలో మాత్రం అనన్య అసలు తగ్గడం లేదు. ఆమె హాట్ ఫోటో షూట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. పొట్టి బట్టల్లో లేలేత నాజూకు అందాల ప్రదర్శిస్తూ దర్శక నిర్మాతల టార్గెట్ గా మారుతుంది. గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే ఆ మాత్రం తెగింపు ఉండాలి మరి.

66

ఇక లైగర్ విడుదల కాకుండగానే సౌత్ లో అనన్య పాండేకు ఆఫర్స్ వెల్లువెత్తుతున్నట్లు సమాచారం. సౌత్ ఇండియా దర్శక నిర్మాతలు ఆమె పట్ల ఆసక్తి చూపుతున్నారు. దీంతో బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా అనన్య బిజీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

click me!

Recommended Stories