దారుణంగా మోసపోయిన హీరో యష్ తల్లి, కేసు నమోదు..నమ్మి డబ్బిస్తే ఏం చేశాడో తెలుసా ?

Published : Nov 19, 2025, 09:42 PM IST

Yash Mother Pushpa: హీరో యష్ తల్లి దారుణంగా మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పీఆర్వో ఆమె వద్ద 65 లక్షలు తీసుకుని మోసం చేయడమే కాక బెదిరింపులకు దిగారు. 

PREV
15
పాన్ ఇండియా సూపర్ స్టార్ యష్ 

కేజీఎఫ్ చిత్రంతో హీరో యష్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా గుర్తింపు పొందారు. కెజిఎఫ్ తర్వాత యష్ నటించే టాక్సిక్, రామాయణం చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో యష్ సినిమాలతో పాటు ఫ్యామిలీకి కూడా ప్రాధాన్యత ఇస్తారు. హీరో యష్ సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే నటుడు. తాజాగా యష్ ఫ్యామిలీ అనుకోని విధంగా వార్తల్లో నిలిచింది. 

25
పీఆర్వోపై యష్ తల్లి కేసు నమోదు 

 హీరో యష్ తల్లి పుష్ప.. పీఆర్వో హరీష్ అరసు అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. యష్ తల్లి పుష్ప నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఆమె ప్రస్తుతం 'కోతలవాడి' అనే చిత్రం నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ విషయంలోనే వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. పీఆర్వో హరీష్ తన వద్ద 65 లక్షలు తీసుకుని మోసం చేశాడని పుష్ప కేసు నమోదు చేశారు. 

35
రూ.65 లక్షల మోసం 

పుష్ప పీఏ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థని ప్రారంభించారు. ఆమె భర్త అరుణ్ కుమార్ పేరు తన పేరులోని మొదటి అక్షరాలు ఉండేలా ఈ నిర్మాణ సంస్థ పేరు ఉంటుంది. ఈ బ్యానర్ లో శ్రీరాజ్ దర్శకత్వంలో కోతలవాడి అనే చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం హరీష్ తన వద్ద రూ 65 లక్షలు తీసుకుని తననే బెదిరిస్తున్నాడు అని పుష్ప ఫిర్యాదులో పేర్కొన్నారు. 

45
యష్ తల్లిని బెదిరించిన పీఆర్వో 

మరింత డబ్బు ఇవ్వకుంటే సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ చేస్తానని హరీష్ బెదిరిస్తునట్లు పుష్ప పోలీసులకు తెలిపారు. తనకు పలు మీడియా సంస్థలు తెలుసు అని.. రిలీజ్ టైం మూవీపై నెగిటివ్ క్యాంపైన్ చేస్తానని హరీష్ చెబుతున్నట్లు పుష్ప వివరించారు. 

55
దర్శకుడికి కూడా బెదిరింపులు 

ఈ వివాదంలో హరీష్ తో పాటు మరో ఇద్దరు కూడా ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. వారిద్దరూ దర్శకుడిని బెదిరిస్తున్నారట. దీనితో పుష్ప పోలీసులని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. పోలీసులతో పాటు ఆమె హరీష్ పై పిఆర్ అసోసియేషన్, కన్నడ ఫిలిం ఛాంబర్ లో కూడా ఫిర్యాదు చేశారు. 

Read more Photos on
click me!

Recommended Stories