Published : Jul 08, 2022, 04:44 PM ISTUpdated : Jul 08, 2022, 04:55 PM IST
స్టార్ హీరో విక్రమ్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారన్న వార్త అందరినీ షాక్ కి గురి చేసింది. అయితే ఆయన జ్వరంతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందుతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఆయన బాగానే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Tamil Star Actor Chiyan Vikram reported to have heart attack
విక్రమ్(Vikram) హీరో భారీ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో ఉండగా నేటి వార్తలు కలవరపెట్టాయి. ఇక విక్రమ్ హెల్త్ గురించి అందుతున్న తాజా సమాచారం టెన్షన్ తగ్గించింది. ప్రస్తుతం కావేరి ఆసుపత్రిలో విక్రమ్ చికిత్స పొందుతున్నారు.
27
మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వం(Ponniyin selvan) మూవీలో విక్రమ్ మెయిన్ హీరో గా నటిస్తున్నారు. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా తెరకెక్కుతుంది. రెండు భాగాలుగా విడుదల చేయనున్న ఈ మూవీలో విక్రమ్ ఆదిత్య కరికాలన్ రోల్ చేస్తున్నారు. ఇటీవల ఆయన లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కింది.
37
పొన్నియిన్ సెల్వం మూవీలో ఐశ్వర్య రాయ్, కార్తీ, జయం రవి, త్రిష ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు. 30 సెప్టెంబర్ 2022లో మొదటి భాగం విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. రెండవ పార్ట్ లో కూడా సేమ్ క్యాస్ట్ నటించనుంది. ఒక్కో పార్ట్ కి దాదాపు రూ. 500 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు సమాచారం.
47
అలాగే విక్రమ్ నటించిన కోబ్రా విడుదలకు సిద్దమవుతుంది. యువ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు కోబ్రా మూవీ తెరెకెక్కించారు. విక్రమ్ పలు గెటప్స్ లో కనిపించనున్నారు. ఈ మూవీతో కమల్ హాసన్ దశావతారం రికార్డు ఆయన బ్రేక్ చేయనున్నారు. ఆగష్టు 11న కోబ్రా విడుదల కానుంది.
57
కోబ్రా(Cobra) యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరెక్కుతుంది. ఈ నెలలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ప్రముఖ క్రికెటర్ పఠాన్ కోబ్రా మూవీలో నటించారు. కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్. కోబ్రా మూవీపై కోలీవుడ్ , టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి.
67
కాగా విక్రమ్ గత చిత్రం మహాన్ నేరుగా ఓటీటీలో విడుదలైంది. కొడుకు ధృవ్ విక్రమ్ తో చేసిన మల్టీస్టారర్ ఇది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన మహాన్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.
77
actor vikram hospitalised
కాగా విక్రమ్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. 2005లో విడుదలైన అపరిచితుడు విక్రమ్ కెరీర్ లో అతిపెద్ద హిట్ గా ఉంది. ఈ రేంజ్ హిట్ విక్రమ్ కి మరలా దక్కలేదు. ఆయన అనేక ప్రయోగాలు చేసినా ఫలించలేదు. ఆయన ఫ్యాన్స్ గ్రేట్ కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు.