ఒక దశలో రామ్ చరణ్-ఉపాసనలకు పిల్లలు పుట్టరంటూ పలు పుకార్లు, ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఏదైనా సమస్య ఉందా? అని ఉపాసనను సన్నిహితులు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయట. పిల్లల్ని కనడం ఒక బాధ్యత. అందుకు పూర్తిగా సన్నద్ధం అయ్యాకే పేరెంట్స్ కావాలని కోరుకున్నట్లు ఉపాసన ఓ సందర్భంలో చెప్పారు.