శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్‌.. హీరో రాజశేఖర్‌ ఎందుకు తిరస్కరించాడు.. తెరవెనుక ఏం జరిగింది?

Published : Mar 29, 2023, 11:26 AM ISTUpdated : Mar 29, 2023, 11:33 AM IST

హీరో రాజశేఖర్‌ యాంగ్రి మేన్‌గా టాలీవుడ్‌లో పేరుతెచ్చుకున్నారు. ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు కెరీర్‌ పరంగా స్ట్రగుల్‌ అవుతున్నాడు. అయితే ఆయనకు అతిలోక సుందరి శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనే ప్రపోజల్‌ రావడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
16
శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్‌.. హీరో రాజశేఖర్‌ ఎందుకు తిరస్కరించాడు.. తెరవెనుక ఏం జరిగింది?

రాజశేఖర్‌.. డాక్టర్‌ నుంచి నటుడిగా మారారు. సినిమాలపై పిచ్చితో ఆయన ఇంట్లో వాళ్లని ఎదురించి మరీ సినిమాల్లోకి వచ్చారు. స్టార్‌ హీరోగా రాణించారు. చిరంజీవి, బాలయ్య, నాగార్జునలకు దీటుగా హీరోగా రాణించారు. అనేక సూపర్‌ హిట్లు అందుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఆయన హీరోగా స్ట్రగుల్‌ అవుతున్నారు. చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోవడం, సరైన ప్రాజెక్ట్ లు రాకపోవడంతో రాజశేఖర్‌ కెరీర్‌ ఓరకంగా ఒడిదుడుకులతో సాగుతుందని చెప్పొచ్చు. 

26

ఇదిలా ఉంటే ఆయనకు సంబంధించిన ఓ షాకింగ్‌ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. రాజశేఖర్‌కి శ్రీదేవి ఫ్యామిలీ నుంచి పెళ్లి ప్రపోజల్‌ రావడమనే వార్త నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతుంది. `ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే`(ఏబీఎన్‌)తో రాజశేఖర్‌, జీవిత ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో వీరిద్దరి లవ్‌ గురించి చెబుతూ, తనకు మొదట శ్రీదేవి నుంచి వచ్చిన పెళ్లి ప్రపోజల్‌ని బయటపెట్టారు రాజశేఖర్‌. 
 

36

తాను డాక్టర్‌గా ఉన్నప్పుడు చాలా హ్యాండ్సమ్‌గా ఉండేవాడట రాజశేఖర్‌. ఆ సమయంలో శ్రీదేవి హీరోయిన్‌గా సినిమాలు చేస్తుంది. అయితే శ్రీదేవి ఫాదర్‌, రాజశేఖర్‌ ఫాదర్‌ మంచి స్నేహితులు. దూరపు బంధువులు కూడా అట. ఆ రిలేషన్‌, ఫ్రెండ్‌షిప్‌ కారణంగా రాజశేఖర్‌ నచ్చి ఆయనకు శ్రీదేవిని పెళ్లికి అడిగారట. కానీ మా వాడు ఎంఎస్‌ చేయాలని ఇప్పుడే పెళ్లి వద్దని రాజశేఖర్‌ పేరెంట్స్ చెప్పారట. అయితే శ్రీదేవి సంబంధాన్ని వద్దనుకోవడానికి అసలు కారణం వేరే ఉందట. ఆ విషయాన్ని రాజశేఖర్‌ బయటపెట్టారు. 
 

46

తమ పేరెంట్స్ కి సినిమా వాళ్లంటే నచ్చదట. అందుకే తాను హీరో అవుతానంటే ఒప్పుకోలేదట. వాళ్లని ఎదురించి ఇంట్లో నుంచి వస్తే చివరికి ఒప్పుకున్నారని, అది కూడా కండీషన్స్ తో అని వెల్లడించారు. సినిమాలు చేయ్‌, కానీ అక్కడ ప్రేమ దోమ అంటూ తిరిగితే ఒప్పుకునేది లేదని, తాము చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే కండీషన్‌ మీద సినిమాలకు పంపించారట. శ్రీదేవి అప్పటికే సినిమాల్లో ఉండటంతో అది నచ్చకనే ఆమె సంబంధాన్ని రిజెక్ట్ చేశారట. అలా శ్రీదేవిని పెళ్లి చేసుకోవాల్సిన రాజశేఖర్‌ మరో నటి జీవితని పెళ్లి చేసుకున్నాడు. వీరిది కూడా లవ్‌ మ్యారేజే కావడం విశేషం. 1991లో వీరి మ్యారేజ్‌ కాగా, వీరికి ఇద్దరు కూతుళ్లు శివానీ, శివాత్మిక ఉన్నారు. ఇద్దరు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. 

56

శ్రీదేవిని చేసుకుంటే బాగుండేదని ఎప్పుడన్నా అనుకున్నారా అన్న ప్రశ్నకి రాజశేఖర్‌ స్పందిస్తూ, అలా ఎప్పుడూ అనుకోలేదని, జీవితని పెళ్లి చేసుకోవడం తన అదృష్టమని చెప్పాడు. అయితే ఇప్పుడు తమ పిల్లలు తనని ఏడిపిస్తుంటారని, డాడీ నువ్వు శ్రీదేవి ఆంటీని చేసుకుని ఉండాల్సింది, అప్పుడు మీకు సరిపోయేది, మీ టార్చర్‌ భరించలేరని  తరచూ ఆటపట్టిస్తుంటారని చెప్పారు. అయితే ఈ ఇంటర్వ్యూ చాలా రోజుల క్రితం చేసింది. కానీ ఇప్పుడు యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. 

66

మరోవైపు అతిలోక సుందరి శ్రీదేవి.. బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్ ని పెళ్లి చేసుకుంది. ఆయనకు శ్రీదేవి రెండో మ్యారేజ్‌. వీరికి ఇద్దరు కూతుళ్లు జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌ ఉన్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్‌30 చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది. మరోవైపు శ్రీదేవి ఐదేళ్ల క్రితం(2018) దుబాయ్‌లో అనుమానాస్పద స్థితిలో కన్నుమూసిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories