ఎక్కడికెళ్లినా కీర్తి సురేష్ కు అదే ప్రశ్న.. మరోసారి తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కళావతి..

First Published | Jun 3, 2023, 1:07 PM IST

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh)  పెళ్లి గురించి కొద్దిరోజులు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోసారి అదే ప్రశ్నఎదురైంది. తాజాగా ఇలా స్పందించింది.
 

‘మహానటి’తో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తన నటనకు ఏకంగా జాతీయ అవార్డు కూడా దక్కింది. మరోవైపు తన అందం, వ్యక్తిత్వంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. 
 

ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తూ వెండితెరపై సందడి చేస్తోంది. తెలుగులో చివరిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళం, మలయాళంలో ఈ ముద్దుగుమ్మ వరుసపెట్టి సినిమాలు చేస్తోంది.
 


ఇదిలా ఉంటే కీర్తి సురేష్ పెళ్లి ఎప్పుడనేది కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఓ బిజినెస్ మ్యాన్ తో కళావతి పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ గతంలో రూమర్లు వచ్చాయి. రీసెంట్ గా తన ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేయడంతో పెళ్లి వార్తలు మరింతగా ఊపందుకున్నాయి.
 

దీనిపై సోషల్ మీడియా వేదికన ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చింది. తానే స్వయంగా వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఉదయానిధి స్టాలిన్ తో కీర్తి సురేష్ కలిసి నటించిన చిత్రం Maamanan ఆడియో లాంచ్ లోనూ అదే ప్రశ్న ఎదురైంది. 
 

మరోసారి కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఆమె మాట్లాడుతూ.. ‘నా పెళ్లి వార్తలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చాను. మీరంతా పెళ్లి గురించే ఎందుకు అడుగుతున్నారు? అంత ఆసక్తి చూపిస్తున్నారేంటీ? నా వెడ్డింగ్ ప్లానింగ్ జరిగితే నేనే స్వయంగా ప్రకటిస్తా. ప్రతి సారి అడగాల్సిన అవసరం లేదు. అదే ప్రశ్నను ప్రశ్నించాల్సిన పనిలేదు‘. అంటూ చెప్పుకొచ్చింది. 
 

కీర్తి సురేష్ మళ్లీ క్లారిటీ ఇవ్వడంతో ఊహాగానాలకు తెరపడినట్లైంది. ఇక ‘మామన్నన్’ చిత్రం ఈనెల 29న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మరోవైపు తెలుగులో కీర్తి సురేష్ ‘భోళా శంకర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 11న థియేటర్లలోకి రానుంది. 

Latest Videos

click me!