యంగ్ హీరో నాగశౌర్య ఇంట పెళ్లి సందడి.. వైరల్ గా మారిన ప్రీ వెడ్డింగ్ పిక్స్.!

Published : Nov 20, 2022, 11:16 AM IST

యంగ్ హీరో నాగశౌర్య పెళ్లి ఈరోజే అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే పెళ్లి మెహందీ, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.  

PREV
16
యంగ్ హీరో నాగశౌర్య ఇంట పెళ్లి సందడి..  వైరల్ గా మారిన ప్రీ వెడ్డింగ్ పిక్స్.!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) పెళ్లివార్త చెప్పి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారడంతో పాటు కొద్దిరోజులు నెట్టింట నాగశౌర్య వెడ్డింగ్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఎట్టకేళలకు ఈరోజు వధువు మెడలో తాళిబొట్టు కట్టి ఓ ఇంటివాడు కాబోతున్నాడు మన యంగ్ హీరో.
 

26

బెంగుళూరులోని జేడబ్ల్యూ మార్రియట్ హోటల్ లో నాగశౌర్య - వధువు అనూష శెట్టి (Anusha Shetty) సందడి ఉదయం నుంచే మొదలైంది. గ్రాండ్ ఏర్పాట్లతో వివాహా వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం 11.25 నిమిషాలకు శుభ ముహూర్తాన వధువు మెడలో తాళి కట్టనున్నాడు. 
 

36

ఇప్పటికే నాగశౌర్య వెడ్డింగ్ కు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రెటీలు, బంధుమిత్రులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నిన్న నాగశౌర్య - అనూష శెట్టి ప్రీ వెడ్డింగ్ ను బెంగళూరులో గ్రాండ్ గా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.
 

46

ప్రీ వెడ్డింగ్ వేడుకలో వధువరులిద్దరూ ఆకర్షణీయంగా కనిపించారు.  అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన హాల్దీ ఫంక్షన్, కాక్ టైల్ పార్టీలోనూ ఇద్దరూ సందడి చేశారు. పార్టీలోనే నాగశౌర్య అనూష వేలికి ఉంగరానన్ని తొడిగారు. కుటుంబికులు, సన్నిహితులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. 
 

56

ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నాగశౌర్య - అనూష్ మేడ్ ఫర్ ఈచదర్ గా ఉన్నారంటూ పొగుడుతున్నారు. మొత్తానికి శౌర్య పెళ్లి చేసుకోవడం పట్ల అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇంతకీ వీరిది లవ్ మ్యారేజా? లేకా అరేంజ్డ్ మ్యారేజా అనేది తెలియాల్సి ఉంది. అనూష ప్రొఫెషన్ ఇంటీరియర్ డిజైనర్ అని తెలుస్తోంది. ఆమె పేరు మీదనే ఓ సంస్థ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోందంట.
 

66

రీసెంట్ గా షూటింగ్ సమయంలో అస్వస్థతకు గురైన నాగశౌర్య గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.  అక్కడి నుంచి నేరుగా పెళ్లి వేడుకలకే హాజరైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగౌశర్య కిషోర్ తిరుమల దర్శకత్వంలో NC24లో నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తైనట్టు తెలుస్తోంది. 
 

click me!

Recommended Stories