కొడుకంటే ఎవరికి ప్రేమ ఉండదు, అది మాకు వర్తించదు.. నెపోటిజంపై నాగ్ సంచలన కామెంట్స్

First Published Mar 25, 2021, 3:14 PM IST


బాలీవుడ్ ని షేక్ చేసింది నెపోటిజం వ్యతిరేక ఉద్యమం. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణం బాలీవుడ్ పెద్దలు, వాళ్ళ వారసులు అంటూ సోషల్ మీడియాలో పెద్ద వివాదం నడిచింది. అలియా, కరీనా, మహేష్ భట్, కరణ్ జోహార్, సల్మాన్ వంటి స్టార్స్ కి నెటిజెన్స్ చుక్కలు చూపించారు. 

చిత్ర పరిశ్రమలో వారసుల ఎదుగుదల కోసం బయటివారిని తొక్కేస్తున్నారని, వారి ఆఫర్స్ లాగేసుకొని మానసికంగా కృంగిపోయేలా చేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్స్ దెబ్బకు తట్టుకోలేక నెలల పాటు కొందరు స్టార్స్ సోషల్ మీడియాకు దూరంగా  ఉండి పోయారు.
undefined
అలాంటి ఒక వివాదాస్పద టాపిక్ పై నాగ్ స్పందించడం జరిగింది. తాజా ఇంటర్వ్యూలో నెపోటిజంపై తన వైఖరి తెలియజేశాడు నాగార్జున.  నాన్న(నాగేశ్వర రావు) పెద్దగా చదువుకోని కారణంగా పిల్లలను బాగా చదివించాలని అనుకున్నారు. అందుకోసం నాతో పాటు బ్రదర్, సిస్టర్స్ ని బాగా చదివించారు. నాన్న చెప్పినట్లు నేను బాగా చదువుకున్నాను.
undefined
అయితే చిన్నప్పటి నుండీ సినిమాతో నాకు అనుబంధం ఉంది. సినిమా కుటుంబం మాది, దీనితో నేను హీరో అవుతానని పట్టుబట్టాను. అలా నాన్నసినిమాలలోకి తీసుకువచ్చారు.
undefined
ఇప్పుడు నా కొడుకులు సినిమా పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. వారు కోరుకున్నారు కాబట్టి పరిశ్రమకు వచ్చారు. వాళ్లకు నేను సపోర్ట్ ఇచ్చాను. డాక్టర్ కొడుకు డాక్టర్, లాయర్ కొడుకు లాయర్, అకౌంటెంట్ కొడుకు అకౌంటెంట్ అవుతున్నారు.
undefined
కొడుకు అంటే ఎవరికి మాత్రం ప్రేమ ఉండదు. వాళ్ళ కోసం కష్టపడతాం , సప్పోర్ట్ ఇస్తాం. అలాగే బయటివాళ్లను కూడా సప్పోర్ట్ చేస్తాం. టాలెంట్ ఉందనిపిస్తే అవకాశాలు ఇస్తాం.
undefined
ఈ నెపోటిజం అసలు అర్థం వేరు. పబ్లిక్ డబ్బులతో నడిపే సంస్థలలో వారసులకు, బంధువులకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని నెపోటిజం అంటారు. ప్రైవేట్ సెక్టార్ కి, వ్యక్తులకు ఇది వర్తించదు. ఇంతకు మించి ఏమి చెప్పలేను.. అని నాగార్జున అన్నారు.
undefined
ఇక తన అందం వెనుక రహస్యం ఏమిటో కూడా నాగార్జున తెలియజేశారు. తండ్రి నుండి వచ్చిన జీన్స్, మంచి అలవాట్లతో పాటు దేవుడు బ్లెస్సింగ్స్ కారణంగా అందంగా ఉన్నానంటూ నాగార్జున అన్నారు.
undefined
నాగార్జున లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్. నాగ్ ఎన్ ఐ ఏ ఏజెంట్ గా నటించగా.. ఏప్రిల్ 2న విడుదల కానుంది. దీనితో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు నాగార్జున.
undefined
click me!