తెలుగు టాప్ యాంకర్ లలో ఒకరు సుమ. లెక్కలేనన్ని టీవీ షోలు, టాక్ షోలు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది సుమ.. సినిమా ఈవెంట్ అంటే ఇప్పటికి మొదట గుర్తు వచ్చే పేరు సుమ. తన యాంకరింగ్ తో స్టేజి మీద తడుముకోకుండా మాట్లాడే సత్తా ఆమె సొంతం.ఎలాంటి షో అయినా.. ఎలాంటి ఈవెంట్ అయినా.. సుమ తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఎంత పెద్ద ఈవెంట్ అయినా సుమ అవలీలగా హ్యాండిల్ చేయగలదు. వివాదాలకు దూరంగా ఉండే ఆమె ఇప్పుడు ఓ రియల్ ఎస్టేట్ వివాదంలో అనుకోకుండా ఇరుక్కున్నట్లు అయ్యింది.
వివాద వివరాల్లోకి వళితే...రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మోసాలు బయటపడ్డాయి.మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేస్తామని 88 కోట్లు కట్టించుకొని బాధితులకు ఆ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది.అపార్టుమెంట్లు నిర్మాణం చేసి ఫ్లాట్ లు ఇస్తామని నమ్మించి మోసం చేసింది.
Anchor Suma Kanakala
రాకీ అవెన్యూస్ బోర్డు తిప్పేయడంతో వందలాది మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో తమకు న్యాయం చేయాలనీ బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తాజాగా .. ఈ విషయం బయటపడటంతో ఆ సంస్థ చైర్మన్ రామయ్య వేణు పరారీలో ఉన్నారు.
Anchor Suma Kanakala
ఈ క్రమంలో బాధితులు కొందరు ఓ మీడియాతో మాట్లాడూతూ... 'రాకీ అవెన్యూస్ కట్టిన ఫేజ్ వన్ బిల్డింగ్స్ చూశానని, ఫేజ్ 2 కూడా త్వరలో కడుతామని సుమతో ప్రచారం చేయించడం వల్లే ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చానని తెలిపారు. తాను త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లు నాలుగు తీసుకొని ఒక్కొక్క ఫ్లాట్ కు 25 లక్షల ధర చెల్లించి మొత్తంగా కోటి రూపాయల వరకు వెచ్చించి రిజిస్ట్రేషన్ చేయించానని' తెలిపారు.
కాగా.. ఫేజ్ వన్ ఫ్లాట్లన్నీ అమ్ముడుపోయాయి. కేవలం 18 లక్షలకే సెకండ్ ఫేజ్ లో ఫ్లాట్. త్వరపడండి ఉగాది సందర్భంగా కంపెనీయే రిజిస్ట్రేషన్ ఫీజు భరిస్తుంది. పైగా జీఎస్టీ కూడా కట్టనవసరం లేదని ప్రముఖ టీవీ యాంకర్ సుమ రాకీ అవెన్యూస్ కు ప్రచారం చేస్తూ చెప్పిన మాటలివి.దీంతో సుమపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఈ యాడ్స్ లో సుమతో పాటు ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా నటించారు. యాంకర్ సుమ స్పందించాలని బాధితులు కోరుకొన్నారు.
suma
బాధితులు మీడియాతో మాట్లాడుతూ.. యాంకర్ సుమ ప్రచారం చేయడం వల్ల ఆకర్షితులమయ్యాం. పెద్ద కంపెనీ కావడంతో తక్కువ ధరకు ఇస్తానని అనడంతో మేము ఫ్లాట్స్‌ను కొనుగోలు చేశాం. అయితే సుమను తప్పు పట్టడం లేదు. కానీ ఆమె ప్రచారం చేయడం వల్లే మేము కొనుగోలు చేశాం. ఆమె మాకు ఏదైనా న్యాయం చేస్తారని కోరుకొంటున్నాం. మేము 26 లక్షలు క్యాష్ ఇచ్చి రిజిస్టర్ చేసుకొన్నాం. పిల్లల భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టాం అని బాధపడ్డారు.