తెలుగులో ఇదే నా చివరి సినిమా ... వైరల్ గా మహేష్ బాబు కామెంట్స్!

Published : Jan 17, 2024, 12:55 PM IST

మహేష్ బాబు గుంటూరు కారం మూవీ తన చివరి సినిమా కావొచ్చు అన్నాడు. ఈ మేరకు ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.   

PREV
16
తెలుగులో ఇదే నా చివరి సినిమా ... వైరల్ గా మహేష్ బాబు కామెంట్స్!

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్ళ పరంగా పర్లేదు అనిపించింది. గుంటూరు కారం వంద కోట్ల షేర్ క్రాస్ చేసింది. అయితే  బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. 

26

గుంటూరు కారంలో మహేష్ అవుట్ అండ్ అవుట్ మాస్ రోల్ చేశాడు. బీడీ తాగుతూ మాస్ మేనరిజమ్స్ తో  అలరించాడు. మహేష్ బాబు పాత్ర ఇలా డిజైన్ చేయడం వెనుక కారణాలు ఉన్నాయట. ఈ మేరకు మహేష్ బాబు కీలక కామెంట్స్ చేశాడు. 

 

36

మొదట్లోనే ఈ మూవీలో రెండు ఊరమాస్ సాంగ్స్ ఉండాలి. అదిరిపోయే స్టెప్స్ తో డిజైన్ చేయాలి అనుకున్నాము. మిర్చీ యార్డ్ లో సాంగ్ కి నక్కిలీసు గొలుసు సాంగ్ అనుకున్నాము. శ్రీలీలతో కుర్చీ మడతపెట్టి సాంగ్ అందులో భాగమే. 

46

నాకు గుంటూరు కారం తెలుగులో చివరి చిత్రం కావచ్చు. రీజనల్ లాంగ్వేజ్ లో నేను ఇకపై చిత్రాలు చేయకపోవచ్చు. డాన్సులు చేసే అవకాశం రాకపోవచ్చు. ఈ అంశాలు దృష్టిలో ఉంచుకుని గుంటూరు కారం చిత్రంలో నా పాత్ర మాస్ గా రూపొందించామని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. 
 

56

మహేష్ నెక్స్ట్ రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అది పాన్ వరల్డ్ మూవీ. పూర్తిగా హాలీవుడ్ చిత్రాల తరహాలో ఉంటుంది. కాబట్టి మహేష్ బాబు గుంటూరు కారం లో మాదిరి మాస్ లుక్ లో కనిపించే అవకాశం లేదు. 

 

66

రాజమౌళి చిత్రం తర్వాత మహేష్ ఇమేజ్ మారిపోవడం ఖాయం. ఆయన పాన్ ఇండియా హీరోగా యూనివర్సల్ సబ్జక్ట్స్ ఎంచుకుంటారు. ఈ అంశాలు దృష్టిలో ఉంచుకుని మహేష్ బాబు ఈ కామెంట్స్ చేశారు. త్వరలో మహేష్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. 

click me!

Recommended Stories