ఇక సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఈ స్టార్ కిడ్ లక్షల మంది ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. దానికి కారణం ఆమె టాలెంట్ కూడా. సితార తరచుగా డాన్స్ వీడియోలు చేస్తుంటారు. అప్పుడప్పుడు పాటలు పాడుతుంటారు. సోషల్ అవేర్నెస్ వీడియోలు చేస్తుంటారు. కేవలం మహేష్ బాబు కూతురుగానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.