అయితే చిరు, అనిల్ చిత్రంలో ఆఫర్ ని కార్తికేయ అంగీకరించాడా లేదా అనేది తెలియదు. కార్తికేయ ఇప్పటికే విలన్ గా నటించాడు. అజిత్ వలిమై చిత్రంలో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటించారు. ఇదిలా ఉండగా చిరు, అనిల్ మూవీ గురించి వస్తున్న మరో రూమర్ ఏంటంటే.. ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార కోసం కూడా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఒక హీరోయిన్ గా అదితి రావు హైదరి ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. మరో హీరోయిన్ పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్, నయనతార లాంటి హీరోయిన్లని సంప్రదిస్తున్నారట. నయనతార కనుక ఒకే అయితే సైరా, గాడ్ ఫాదర్ తర్వాత చిరంజీవితో ఆమెకి ఇది మూడవ చిత్రం అవుతుంది.