500 కోట్ల విలువైన డైమండ్ కోసం రాబరీ, ఘాటు రొమాన్స్ తో సైఫ్ అలీ ఖాన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి..

Published : Apr 26, 2025, 07:49 PM IST

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇటీవల విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్నారు. ఆదిపురుష్ చిత్రంలో రావణుడిగా నటించారు. అదే విధంగా ఎన్టీఆర్ దేవర చిత్రంలో విలన్ నటించి అదరగొట్టారు.

PREV
15
500 కోట్ల విలువైన డైమండ్ కోసం రాబరీ, ఘాటు రొమాన్స్ తో సైఫ్ అలీ ఖాన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి..
Saif Ali Khan

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇటీవల విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్నారు. ఆదిపురుష్ చిత్రంలో రావణుడిగా నటించారు. అదే విధంగా ఎన్టీఆర్ దేవర చిత్రంలో విలన్ నటించి అదరగొట్టారు. సైఫ్ అలీ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జ్యువెల్ థీఫ్. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయింది. 

25
Saif Ali Khan films

ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించగా నికితా దత్త హీరోయిన్ గా నటించింది. జైదీప్ ఆహ్లావత్, కునాల్ కపూర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. నెట్ ఫ్లిక్స్ లోకి రిలీజ్ అయిన వెంటనే ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మూవీ ఒకసారి చూడదగ్గ విధంగా థ్రిల్లింగ్ రాబరీ అంశాలతో తెరకెక్కించారు. 

35

నెట్ ఫ్లిక్స్ లోకి రిలీజ్ అయిన వెంటనే పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మలో కూడా ఈ చిత్రం లీక్ అయి ట్రెండింగ్ గా మారింది. ఈ చిత్ర కథాంశం ఏంటో ఇప్పుడు చూద్దాం. సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో రెహాన్ రాయ్ అనే వజ్రాలు దొంగతనం చేసే వ్యక్తిగా నటించారు. రాబరీ చేస్తూ దేశ విదేశాలు తిరుగుతుంటాడు. 

45

ఆ విధంగా హంగరీ దేశంలో ఉన్న తన సోదరుడిని సైఫ్ కలుస్తాడు. ఒక విషయంలో తన తండ్రి మోసపోయిన సంగతి గురించి తెలుసుకుంటాడు. తన తండ్రిని కష్టాల నుంచి బయట పడేసేందుకు విలన్ తో సైఫ్ కి ఒక ఒప్పందం కుదురుతుంది. ఆ ఒప్పందం ప్రకారం సైఫ్ ముంబైలో అత్యంత పటిష్టమైన భద్రతలో ఉన్న రెడ్ సన్ అనే వజ్రాన్ని దొంగిలించాలి. ఆ డైమండ్ విలువ 500 కోట్లు. 

55

అసలు సైఫ్ తండ్రి ఏ విషయంలో మోసపోయారు ? అందులో విలన్ పాత్ర ఏంటి ? సైఫ్ ని ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న పోలీస్ అధికారి కునాల్ కపూర్ ని తప్పించుకుని సైఫ్ ఆ వజ్రాన్ని రాబరీ చేయగలిగాడా ? అనే విషయంలో సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ చిత్రంలో థ్రిల్లింగ్ అంశాలతో పాటు రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. నికిత దత్త, సైఫ్ అలీ ఖాన్ ముద్దు సన్నివేశాల్లో నటించారు. మొత్తంగా ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories