భారతీయుడు 2 ట్విట్టర్ రివ్యూ: సేనాపతి ఈజ్ బ్యాక్, కమల్ విశ్వరూపం, అదే మైనస్, ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే?

First Published Jul 12, 2024, 6:20 AM IST


కమల్ హాసన్-శంకర్ కాంబోలో తెరకెక్కిన పేట్రియాటిక్ యాక్షన్ డ్రామా భారతీయుడు 2. అంచనాల మధ్య విడుదలైంది. యూఎస్ లో భారతీయుడు 2 మూవీ ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మరి భారతీయుడు 2 అంచనాలు అందుకుందా? ఎలా ఉందో చూద్దాం?

Bharateeyudu 2 Review

1996లో వచ్చిన భారతీయుడు ఒక అద్భుతం. దర్శకుడు శంకర్ దేశంలో పెరిగిపోయిన అవినీతి మీద వదిలిన అస్త్రం. తెల్లదొరలకు మించి అధికారులు పేదలను దోచేస్తుంటే... ఒకప్పటి స్వాతంత్ర్య సమరయోధుడు తిరగబడితే ఎలా ఉంటుంది... అనే కోణంలో భారతీయుడు తెరకెక్కింది. భారతీయుడు మూవీలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ చేశాడు. భారతీయుడు విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. 

Bharateeyudu 2 Review

యుద్ధ విద్యలు, మర్మ కళ తెలిసిన వృద్ధుడి పాత్రలో కమల్ హాసన్ మెస్మరైజ్ చేశాడు. ఆ సినిమాను ఇంకో వందేళ్ల తర్వాత కూడా ఆడియన్స్ మర్చిపోలేరు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరొక ప్రధాన హైలెట్. మరి అలాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

Latest Videos


Bharateeyudu 2 Review

అయితే భారతీయుడు 2 చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి. సెట్స్ లో ప్రమాదం జరిగి ఇద్దరు యూనిట్ సభ్యులు మరణించారు. నిర్మాతలతో దర్శకుడు శంకర్ కి విబేధాలు తలెత్తాయి. దాంతో మొత్తంగా ప్రాజెక్ట్ ఆగిపోయింది. గత ఏడాది కమల్ హాసన్ విక్రమ్ మూవీతో భారీ విజయం అందుకున్నాడు. ఈ క్రమంలో భారతీయుడు 2 చిత్రాన్ని నిర్మాతలు తిరిగి పట్టాలెక్కించారు. 

Bharateeyudu 2 Review

2019 జనవరిలో షూటింగ్ మొదలు కాగా 2024 జులై 12న విడుదల చేశారు. ఆ సంగతులు పక్కన పెడితే భారతీయుడు 2 ఎలా ఉంది? శంకర్ తన మార్క్ చూపించాడా? భారతీయుడు చిత్రాన్ని మరిపించిందా?. ట్విట్టర్ టాక్ ప్రకారం భారతీయుడు 2 ఫస్ట్ హాఫ్ జస్ట్ యావరేజ్. 
 

Bharateeyudu 2 Review

సినిమా హీరో సిద్ధార్థ్ మీద ఓపెన్ అవుతుంది. దేశంలో పెరిగిపోతున్న అవినీతి మీద సిద్ధార్థ్ తన టీమ్ తో కలిసి వీడియోలు చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. శంకర్ ప్రారంభ సన్నివేశాల్లోనే మెయిన్ పాయింట్ ని టచ్ చేశాడని అంటున్నారు. నేరుగా కథలోకి వెళ్ళాడట. 

Bharateeyudu 2 Review

సేనాపతి(ఓల్డ్ కమల్ హాసన్) అవినీతికి పాల్పడుతున్న కొడుకును చంపి విదేశాలకు వెళ్లిపోవడంతో పార్ట్ 1 ముగుస్తుంది. పార్ట్ 2 అక్కడి నుండే మొదలుపెట్టాడు. విదేశాల నుండి కమల్ హాసన్ ఇండియాకు దిగుతాడు. తన పోరాటం మరోసారి మొదలుపెడతాడు. మూవీ ప్రారంభం బాగుంది. కొన్ని సన్నివేశాలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయట. 

Bharateeyudu 2 Review

అయితే కమల్ హాసన్ ఎంట్రీ తర్వాత మూవీ డల్ అయ్యిందని అంటున్నారు. వృద్దుడిగా కమల్ హాసన్ గెటప్ ఫస్ట్ హాఫ్ లో అంతగా ఇంప్రెస్ చేయలేదని టాక్. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే స్క్రీన్ ప్లే శంకర్ మార్క్ ఓల్డ్ ఫార్మాట్ లో సాగుతుంది. అది అంతగా ఆకట్టుకోలేదని సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాదన. 

Bharateeyudu 2 Review

అనిరుధ్ మ్యూజిక్ పర్లేదని ఆడియన్స్ అభిప్రాయం. తెలుగు సాంగ్స్ బాగా నిరాశపరిచాయని అంటున్నారు. భారతీయుడు మూవీకి ఏఆర్ రెహమాన్ ఇచ్చిన సాంగ్స్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఆ స్థాయి సాంగ్స్, మ్యూజిక్ ఆశించడం అత్యాశే అవుతుంది. కొందరు అనిరుధ్ మ్యూజిక్ నిరాశపరిచింది అంటున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకుంటుంది. 

Bharateeyudu 2 Review


ఫస్ట్ హాఫ్ లో ఒకటి రెండు యాక్షన్ ఎపిసోడ్స్ మెప్పిస్తాయి. లాంగ్ లెన్త్ డైలాగ్స్, సాగదీతతో కూడిన సన్నివేశాలు నిరాశపరుస్తాయట. సెకండ్ హాఫ్ పర్లేదు అంటున్నారు. క్లైమాక్స్ ట్విస్ట్ మూవీకి హైలెట్ అట. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్, ఎస్ జె సూర్య, బాబీ సింహ తమ పాత్రలకు న్యాయం చేశారని టాక్. 

మొత్తంగా భారతీయుడు 2 పర్లేదు అనిపిస్తుంది. శంకర్ రేంజ్ మూవీ అయితే కాదు. పార్ట్ 1 ని ఏమాత్రం మరిపించలేదు. ఆ మూవీ దరిదాపుల్లో కూడా భారతీయుడు 2 లేదు. ఒకప్పుడు భారతీయుడు స్వాగ్ ని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ మరోసారి సేనాపతి పాత్రలో కమల్ ని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఈ జనరేషన్ కి భారతీయుడు 2 కొత్తగా అనిపినించే అవకాశం కలదు. పూర్తి రివ్యూ వస్తే కానీ ఫలితం తెలియదు.. 

click me!