విజయ్ దేవరకొండ గొప్ప మనసు..కన్నీరు పెట్టుకుంటూ ఎమోషనల్ అయిన ట్రాన్స్ జెండర్

Published : Jul 11, 2024, 10:37 PM IST

విజయ్ దేవరకొండ లాక్ డౌన్ సమయంలో తన ది దేవరకొండ ఫౌండేషన్ సంస్థ ద్వారా దాదాపు 6 వేల కుటుంబాలకు సాయం అందించాడు.

PREV
16
విజయ్ దేవరకొండ గొప్ప మనసు..కన్నీరు పెట్టుకుంటూ ఎమోషనల్ అయిన ట్రాన్స్ జెండర్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ చాలా సందర్భాల్లో తన గొప్ప మనసు చాటుకున్నారు. అభిమానులకు సాయం చేయడం.. కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సాయం చేయడం ఇలా విజయ్ దేవరకొండ తరచుగా తన మంచి మనసుని బయట పెడుతూనే ఉన్నాడు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ ఆహాలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి అతిథిగా హాజరయ్యాడు. 

26

అక్కడ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. విజయ్ దేవరకొండ లాక్ డౌన్ సమయంలో తన ది దేవరకొండ ఫౌండేషన్ సంస్థ ద్వారా దాదాపు 6 వేల కుటుంబాలకు సాయం అందించాడు. లాక్ డౌన్ సమయంలో చాలా కుటుంబాలు పూట గడవక ఇబ్బందులు పడ్డారు. ఉపాధి లేకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. 

36

సోనూసూద్, చిరంజీవి లాంటి స్టార్లు తమదైన శైలిలో సాయం చేశారు. మరో వైపు విజయ్ దేవరకొండ కూడా తన ఫౌండేషన్ ద్వారా సాయం చేశాడు. విజయ్ దేవరకొండ నుంచి సాయం పొందిన వారిలో ట్రాన్స్ జెండర్స్ కూడా ఉన్నారు. 

 

46

ఇండియన్ ఐడల్ వేదికపై విజయ్ దేవరకొండ నుంచి సాయం పొందిన కొన్ని కుటుంబాల తో పాటు ఓ ట్రాన్స్ జెండర్ కూడా కనిపించారు. ఆ ట్రాన్స్ జెండర్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. 'సర్ నేను ఒక ట్రాన్స్ జెండర్ ని.. రెండేళ్లుగా మీకు థ్యాంక్స్ చెప్పాలని ఎదురుచూస్తున్నా. 

56

లాక్ డౌన్ సమయంలో మాకు ఫుడ్ కూడా దొరకలేదు. మేము బిక్షాటన చేసి జీవించేవాళ్ళం. ఆ సమయంలో మీ ఫౌండేషన్ గురించి సోషల్ మీడియాలో తెలుసుకున్నా. సాయం కోరుతూ అప్లై చేయగానే వెంటనే ఫోన్ వచ్చింది. వెంటనే సాయం కూడా అందింది. నాతో పాటు 18 మంది ట్రాన్స్ జెండర్స్ కి మీ ఫౌండేషన్ ద్వారా సాయం దొరికింది. 

66
Vijay Devarakonda

ఆ సాయంలో మేమంతా దేవుడు ఎక్కడో లేదు.. మీరూపంలోనే వచ్చాడు అని అనుకున్నాం అంటూ ట్రాన్స్ జెండర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆమెని చూసి విజయ్ కూడా ఎమోషనల్ అయ్యారు. తన పౌండేషన్ కి చాలా మంది 500, 1000 ఇలా పంపారు. వాళ్ళందరి వల్లే ఇది సాధ్యం అయింది అని విజయ్ దేవరకొండ తెలిపాడు. 

click me!

Recommended Stories