రామబాణం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న సుమ అడ్డా షోలో పాల్గొన్నారు. శ్రీవాస్, గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయతి సుమ అడ్డా షోకి హాజరయ్యారు. తాజాగా సుమ అడ్డా ప్రోమో విడుదలైంది. ఎప్పటిలాగే సుమ సరదా ప్రశ్నలు అడుగుతూ మంచి వినోదం అందించారు.