ఈరోజు(9 పిబ్రవరి) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన లాల్ సలామ్ గురించి ధనుష్ ట్వీట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. హీరో ధనుష్ 2004లో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు లింగ, యాత్ర అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెళ్లయ్యాక భార్యను దర్శకురాలిగా తీర్చిదిద్దిన ధనుష్ తన మొదటి సినిమా 3లో హీరోగా నటించాడు. అంతే కాకుండా, అతను ఐశ్వర్య డైరెక్ట్ చేసిన సెకండ్ మూవీ వై రాజా వాయ్‌లో కొక్కి కుమార్‌గా అతిధి పాత్రలో కనిపించాడు.