'మగధీర' చూసి ఫిక్సయ్యారా..చరిత్ర మరిచిన మహా వీరుడిగా రాంచరణ్, 11వ శతాబ్దం నాటి కథ ఇదే..

First Published | Feb 9, 2024, 3:45 PM IST

11 వ శతాబ్దానికి చెందిన అపర పరాక్రమవంతుడైన మహారాజు సుహీల్ దేవ్ చరిత్ర ఆధారంగా రచయిత అమిష్ త్రిపాఠి ఓ కథని రెడీ చేశారు. ఈ కథనే సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తదుపరి చిత్రాల హీటు నెమ్మదిగా పెరుగుతోంది. ప్రస్తుతం చరణ్ దిగ్గజ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ నటించాల్సి ఉంది. ఇది కూడా పీరియాడిక్ డ్రామా గానే తెరకెక్కుతోంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ అనే ప్రచారం జరుగుతోంది. 

ఇదంతా పక్కన పెడితే రాంచరణ్ బాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం జోరందుకుంది. సంజయ్ లీలా భన్సాలీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. కళాత్మక చిత్రాలకు ఆయన పెట్టింది పేరు. అయితే రాంచరణ్ తో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించే చిత్రానికి సంబంధించిన వార్తలు ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచేస్తున్నాయి. 


ఈ కాంబినేషన్ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. కోవిడ్ టైమ్ నుంచి కసరత్తు జరుగుతోందట. ఈ చిత్ర కథకి సంబంధించిన వార్తలు మెగా ఫాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేసేలా ఉన్నాయి. మగధీర చిత్రంలో రాంచరణ్ కాలభైరవగా సర్వసైన్యాధ్యక్షుడిగా నటించాడు. హార్స్ రైడింగ్, కత్తి యుద్దాలు మగధీరతో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించాయి. 

అలాంటి చిత్రమే సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించబోతున్నారు. 11 వ శతాబ్దానికి చెందిన అపర పరాక్రమవంతుడైన మహారాజు సుహీల్ దేవ్ చరిత్ర ఆధారంగా రచయిత అమిష్ త్రిపాఠి ఓ కథని రెడీ చేశారు. ఈ కథనే సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. 

సుహీల్ దేవ్ ఉత్తర ప్రదేశ్ లోని బహ్ రీచ్ కేంద్రంగా భారతదేశాన్ని పాలించారు. .  కానీ కాలక్రమంలో చరిత్ర వక్రీకరించబడడం వల్ల సుహీల్ పరాక్రమం గురించి చాలా మందికి తెలియదు అని చెబుతుంటారు. ఇండియాలోకి గజినీ చక్రవర్తుల ఆక్రమణ జరగకుండా సుహీల్ ఉన్నంతవరకు అడ్డుకున్నారు. మహమ్మద్ ఆఫ్ గజినీని ఓడించారు. ఇతర రాజుల సహాయంతో మహాకాల సైన్యం ఏర్పాటు చేసి గజినీ లకు చుక్కలు చూపించిన వీరుడు సుహీల్ దేవ్. 

అలాంటి వీరుడి కథకి రాంచరణ్ సరిగ్గా నప్పుతాడు అని సంజయ్ లీలా భన్సాలీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాధమిక చర్చలు ముగిసినట్లు సమాచారం. అత్యంత భారీ బడ్జెట్ లో గ్లోబల్ ప్రాజెక్టు గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. వీలైనంత త్వరగా ఈ చిత్రానికి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. 

Latest Videos

click me!