రెండో పెళ్లికి రెడీ అయిన ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్, సూపర్ స్టార్ కూతురు చేసుకోబోయేది ఎవరిని..?

Published : Jul 11, 2023, 07:56 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్ళిళ్లు.. విడాకులు కామన్ అయిపోయాయి. చిటికలో పెళ్ళి.. చేసుకుని... అంతలోనే విడాకులు తీసుకుంటున్నారు. ఆమధ్య విడాకులు తీసుకున్న తమిళ స్టార్ కపుల్ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ గురించి తెలిసిందే.. తాజాగా ఐశ్వర్య రెండో పెళ్లికి రెడీ అవుతుందట.   

PREV
16
రెండో పెళ్లికి రెడీ అయిన ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య   రజనీకాంత్, సూపర్ స్టార్  కూతురు చేసుకోబోయేది ఎవరిని..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలా పెళ్ళి చేసుకుని..అలా విడిపోతున్నారు స్టార్ కపుల్స్..కాని కొంత మంది మాత్రం సుధీర్ఘ కాలంగా కాపురాలు చేస్తున్నారు. ఈక్రమంలో దాదాపు 18 ఏళ్ల కాపురం తరువాత ఆమధ్య విడాకులు తీసుకున్నారు తమిళ స్టార్ కపుల్స్ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్. ఇద్దరు పిల్లలు పెద్దవారు అయ్యారు. అయినా సరే విబేధాలవల్ల విడాకుల వరకూ వెళ్లారు స్టార్ కపుల్. వీళ్ళను కలపడానికి రజనీకాంత్ లాంటి వారు చేసిన ప్రయత్నాలు విఫలం అయినట్టు సమాచారం. ఈ క్రమంలో ఐశ్వర్య రజనీకాంత్ కు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే..? 
 

26

సూపర్ స్టార్ రజినీ కాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ తమిళ మీడియాను కుదిపేస్తోంది.సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మాట విపరీతంగా వినిపిస్తుంది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ – ఐశ్యర్య కపుల్ విడిపోతున్నట్లు గతేడాది ప్రకటించారు. 18 ఏళ్ల తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
 

36

తర్వాత కొద్ది రోజులకి విడాకులు తీసుకోవట్లేదు వాటిని రద్దు చేసుకుంటున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతే కాదు మీరు విడిపోవద్దు.. మళ్లీ కలవండి అంటూ ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్ లు కూడా వచ్చయి. కాని ఫలితం లేకుండా పోయింది.  అయితే వాటి గురించి ధునుష్ – ఐశ్వర్య ఇద్దరిలో ఎవరూ రియాక్ట్ కాలేదు. దీంతో ఇక వీరు కలవడం కష్టమనుకుని సైలెంట్ అయిపోయారు ఫ్యాన్స్. 

46

మరి ఆమె పబ్లిక్ గా  స్పందిస్తుందా లేదా చూడాలి. అటు ధనుష్.. రీసెంట్ గా తన  కుమారులు యాత్ర – లింగ ఇద్దరితో కలిసి తిరుమలకు వచ్చారు. హీరోగా 50వ సినిమా తానే డైరెక్ట్ చేయడం.. హాఫ్ సెంచరీ  మైలురాయిని చేరుకోవడం తో దైవ దర్శనంత పాటు..  పాత్ర కోసం గుండు చేయించుకోవడానికి తిరుమల వచ్చారు ధనుష్. ఇక ఐశ్వర్య  డైరెక్షన్ లో బిజీగా ఉంది. రజనీకాంత్ కీలకపాత్రలో ఆమె ప్రస్తుతం లాల్ సలాం సినిమా చేస్తోంది. 
 

56
Aishwarya Dhanush

ఇక విడాకులు రావడంతో..  ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఐశ్వర్య చేసుకోబోయే వ్యాక్తి అంటూ ఓ సినిమా హీరో గురించి కూడా వార్తలు వస్తున్నాయి. బిజినెస్ మెన్ గా బాగా పాపులర్అయ్యి.. ఆతరువాత సినిమాల్లో హీరోగా సెటిల్ అయిన వికాసన్ తో ఐశ్వర్య సన్నిహితంగా ఉంటుందంటూ.. కొన్ని మిడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. 

66
aishwarya dhanush

ఈ  తమిళ  హీరోతో ఐశ్యర్య ఎక్కువగా కనిపిస్తుందట. చెన్నైలోని ఓ రిసార్ట్‌లో ఆ హీరోతో ఐశ్వర్య సన్నిహితంగా ఉండండంతో సెకండ్ మ్యారేజ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ వార్తలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో.. ఈ విషయంలో ఐశ్వర్య పబ్లిక్ గా కాకుండా పర్సనల్ గా స్పందించినట్టు తెలుస్తోంది. అవన్నీ ఉట్టి పుకార్లే అని ఐశ్వర్య కొట్టిపారేశారట. 

click me!

Recommended Stories