మాళవికా మోహనన్ బ్యూటీఫుల్ లుక్.. టాప్ షోతో మతులు పోగొడుతున్న మలయాళీ అందం.. పిక్స్

First Published | Jul 11, 2023, 6:46 PM IST

మలయాళ అందం మాళవికా మోహనన్ (Malavika Mohanan)  లేటెస్ట్ ఫిల్మ్ ‘తంగళాన్’. తమిళ స్టార్ చియాన్ విక్రమ్ సరసన నటిస్తోంది. షూటింగ్ పూర్తైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మెరుస్తోంది. 
 

కోలీవుడ్ లో వరుస చిత్రాలతో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ సందడి చేస్తోంది. ఇప్పటికే ఆయా చిత్రాలతో అక్కడ మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘తంగళాన్’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. 
 

తమిళంలో మాళవికాకు ఉన్న బిగ్ ప్రాజెక్ట్ Thangalaan మాత్రమే. తమిళ స్టార్ చియాన్ విక్రమ్ సరసన నటిస్తోంది. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.
 


త్వరలో చిత్ర ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహించేందుకు యూనిట్ సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో మాళవికా మోహనన్ ఇప్పటి నుంచే తన సినిమాను ప్రచారం చేసుకునేలా నెట్టింట సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట మెరుస్తోంది. 
 

తాజాగా ట్రెండీ వేర్ లో దర్శనిచ్చింది. క్లోజప్ షాట్స్ లో ఫొటోషూట్ చేసి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మంత్రముగ్ధులను చేసింది. టాప్ గ్లామర్ షోతో మెస్మరైజ్ చేస్తోంది. గుచ్చేచూపులు, మత్తెక్కించే ఫోజులు, బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేసింది. 
 

గ్లామర్ షోలో ఈ ముద్దుగుమ్మ రోజుకో తీరును ప్రదర్శిస్తోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్ల చూపు తనపై పడేలా చేస్తోంది. బ్యూటీఫుల్ లుక్స్ లో అందరి అటెన్షన్ ను డ్రా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ ను ఫ్యాన్స్, నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

చియాన్ విక్రమ్ సరసన ‘తంగళాన్’లో నటిస్తూనే.. హిందీలోనూ ఓ సినిమాలో మెరియనుంది. ‘యుద్ర’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నట్ట తెలుస్తోంది. ఇక తర్వలో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ - మారుతీ సినిమాలో అవకాశం వచ్చిందని టాక్. దీనిపై అధికారిక ప్రకటన లేదు.
 

Latest Videos

click me!