ఎన్టీఆర్ నటించిన దాన వీర శూర కర్ణ ఓ ఎపిక్ అని చెప్పాలి. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఆ చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు గెటప్స్ లో కనిపించాడు. దుర్యోధనుడిగా ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ ఎవర్ గ్రీన్. ఇప్పటికీ పల్లెటూళ్లలో ఆ డైలాగ్స్ ఆడియో జనాలు వింటూ ఉంటారు. ఇక మయసభలో పరాభవం జరిగిన తర్వాత దుర్యోధనుడు తనలో తాను అవమాన భారం అనుభవిస్తాడు.