సమంత రూత్ ప్రభు ఇండియా వైడ్ పాపులారిటీ ఉన్న హీరోయిన్. ఒకప్పుడు సౌత్ కి మాత్రమే పరిమితమైన ఆమె ఇమేజ్ ది ఫ్యామిలీ మ్యాన్ 2, పుష్ప చిత్రాలు దేశవ్యాప్తం చేశాయి. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో సమంత ఒకరు. సినిమాకు రూ. 5 కోట్లకు పైగా తీసుకుంటుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అయితే ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తుంది.