బిగ్ బాస్ ప్రియాంక అంటే నటి ప్రగతికి అంత ప్రేమా.. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటో తెలుసా ?

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక చాలా చురుకైన కాటెస్టెంట్. టాస్క్ లలో పార్టిసిపేట్ చేస్తూ అవసరమైనప్పుడు తన వాయిస్ బలంగా వినిపిస్తోంది. అంతే కాదు హౌస్ మేట్స్ కోసం వంట చేసేది కూడా ప్రియాంకనే.

here is relation between Bigg Boss 7 Priyanka Jain and Pragathi dtr

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా కలర్ ఫుల్ హంగామా సాగుతోంది. ఆదివారం రోజు దీపావళి సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో సెలెబ్రేషన్స్ నిర్వహించారు. స్పెషల్ ఈవెంట్ కోసం కొందరు అతిథులు కూడా హాజరయ్యారు. 

here is relation between Bigg Boss 7 Priyanka Jain and Pragathi dtr

మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వచ్చి సందడి చేశారు. శ్రీలీల, కాజల్ అగర్వాల్, బుచ్చిబాబు కూడా హాజరయ్యారు. కొందరి కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు కూడా వేదికపై సందడి చేశారు. దీపావళి స్పెషల్ ఈవెంట్ లో ప్రియాంక జైన్ కి సంబంధించిన ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. 


ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక చాలా చురుకైన కాటెస్టెంట్. టాస్క్ లలో పార్టిసిపేట్ చేస్తూ అవసరమైనప్పుడు తన వాయిస్ బలంగా వినిపిస్తోంది. అంతే కాదు హౌస్ మేట్స్ కోసం వంట చేసేది కూడా ప్రియాంకనే. దీనితో హౌస్ లో అందరి ఆకలి తీర్చే తల్లిగా మారింది ప్రియాంక అంటూ పొగిడేస్తున్నారు. శివాజీ కొడుకు కూడా వేదికపైకి వచ్చి మా నాన్నకు టేస్టీ ఫుడ్ పెడుతున్నందుకు థ్యాంక్స్ అని చెప్పాడు. 

ఇక వేదికపైకి సర్ప్రైజింగ్ గా ప్రియాంక జైన్ తల్లితో కలసి నటి ప్రగతి కూడా వచ్చింది. దీనికి ఓ కారణం ఉంది. వాళ్ళిద్దరిని చూడగానే ప్రియాంక థ్రిల్ ఫీలై ఎమోషనల్ అయింది. నటి ప్రగతి మాట్లాడుతూ రీల్ మదర్, రియల్ మదర్ ఇద్దరం వచ్చాం అని చెప్పింది. 

నేను ప్రియాంక జైన్ నటించిన తొలి చిత్రంలో ఆమెకి తల్లిగా నటించాను. ఫస్ట్ సినిమాలో ప్రియాంకని ఎలా చూశానో ఇప్పటికీ అదే ఇంటెన్స్, ఎనేర్జి, అదే నవ్వు, అంతే అందంతో ఉందని ప్రగతి ప్రశంసలు కురిపించింది. నువ్వు చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నావు అని చెప్పడానికే నేను ఇక్కడకి వచ్చాను అని ప్రగతి పేర్కొంది. 

ఎంతో ధైర్యంగా, హద్దులు దాటకుండా ఆడుతున్నావు అని ప్రగతి ప్రశంసలు కురిపించింది. ఇంతకీ మించి నేను ఇంకేమి అడగలేను.. మీరు నాకోసం వచ్చారు అని ప్రియాంక తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తొలి చిత్రంలో ప్రియాంకకు తల్లిగా నటించినప్పటి నుంచి ప్రగతికి ఆమెపై ప్రత్యేకమైన ఇష్టం, అభిమానం ఏర్పడ్డాయి. స్క్రీన్ పై తల్లి కూతుళ్లుగా నటించినా ఆ బాండింగ్ మాత్రం అలాగే ఉంది. 

ఇక ప్రియాంక తన రియల్ లైఫ్ తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయింది. మీ అమ్మ మీ సిస్టర్ లాగా ఉన్నారు అంటూ శివాజీ సరదాగా కామెంట్ చేశారు. ఇక ప్రియాంక తప్పకుండా నంబర్ 1 కంటెస్టెంట్ గా నిలిచి టైటిల్ విన్ అవుతుంది అని ప్రగతి తెలిపింది. ఇక శివాజీకి ప్రగతి సెకండ్ ప్లేస్ ఇచ్చింది. ప్రియాంక తల్లి మాట్లాడుతూ ప్రియాంక, శోభా ఇద్దరూ స్నేహితులుగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. 

Latest Videos

vuukle one pixel image
click me!