థియేటర్ కి రాని సూపర్ హిట్ సిరీస్.. మిస్ అయ్యారా..?

First Published Mar 24, 2019, 11:55 AM IST

ఈ మధ్యకాలంలో యూత్ మొత్తం కూడా వెబ్ సిరీస్ చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. 

ఈ మధ్యకాలంలో యూత్ మొత్తం కూడా వెబ్ సిరీస్ చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. హాలీవుడ్, బాలీవుడ్ లలో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అది టాలీవుడ్ కి కూడా పాకింది. తెలుగులో కూడా వెబ్ సిరీస్ హవా నడుస్తోంది. అలా యూట్యూబ్ లలో హిట్ అయిన వెబ్ సిరీస్ చాలానే ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం!
undefined
ముద్దపప్పు ఆవకాయ - నీహారిక, ప్రతాప్ లు నటించిన ఈ వెబ్ సిరీస్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇద్దరు భిన్న మనస్తత్వాలు గల జంట ప్రేమలో ఎలా పడుతుంది..? వారి జీవితం ఎలా సాగుతుందనే అంశాలతో తెరకెక్కిన ఈ సిరీస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
undefined
మహాతల్లి - జాహ్నవి నటించిన ఈ వెబ్ సిరీస్ అందరికీ వ్యసనంగా మారింది. 'మీ మహాతల్లి' అంటూ ఆమె చేసే అల్లరి అంతా ఇంతా కాదు. చాలా మంది యంగ్ స్టర్స్ సరదాగా నవ్వుకోవడం కోసం ఈ సిరీస్ చూస్తుంటే ఉంటారు.
undefined
గీతా సుబ్రమణ్యం - ఇద్దరి మధ్య లవ్ స్టోరీ.. అందరికీ తెలిసిన కాన్సెప్ట్ అయినప్పటికీ బుల్లితెరపై అందంగా చూపించే ప్రయత్నం చేశారు.
undefined
పెళ్లి గోల : అబిజీత్, వర్షిని నటించిన ఈ సిరీస్ ని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశారు. పెళ్లి అంటే పారిపోయే ఓ జంట మధ్య సాగే అందమైన ప్రేమ కథగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో ఉండే ఫ్యామిలీ ఎలిమెంట్స్, విలేజ్ బ్యాక్ గ్రౌండ్ అందరినీ ఆకట్టుకుంటుంది.
undefined
పిల్లా : ప్రీ మారిటల్ ప్రెగ్నెన్సీ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సిరీస్ నేటి యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.
undefined
నేను మీ కళ్యాణ్ : తన ప్రేమని దక్కించుకోవడం కోసం ఓ కుర్రాడి పడే తపనే 'నేను మీ కళ్యాణ్'. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లవ్ స్టోరీ ఇలా సరదాగా సాగిపోతుంది.
undefined
ఎందుకిలా..? : తన జీవితంలో దురదృష్టం తప్ప మరొకటి లేదని భావించే కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం ఫ్యామిలీతో పడే తిప్పలు అన్నీ కూడా తెరపై అందంగా చూపించారు. కచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్ లో ఇదొకటి.
undefined
పోష్ పోరీస్ : ముగ్గురు పోష్ అమ్మాయిల చుట్టూ తిరిగే కథే ఇది.
undefined
నేను నా గర్ల్ ఫ్రెండ్ : రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సిరీస్ యూత్ ని ఆకట్టుకుంది.
undefined
స్టేజెస్ ఆఫ్ లవ్ : లవ్ లో ఉండే స్టేజెస్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సిరీస్ టీనేజర్స్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది.
undefined
మన ముగ్గురి లవ్ స్టోరీ : ముగ్గురి మధ్య జరిగే ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో నడిచే ఈ వెబ్ సిరీస్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. ఈ సిరీస్ లో తేజస్వి క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంటుంది.
undefined
703: అనుపమ్ తేజ్ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ కాన్సెప్ ఓ వర్గపు ఆడియన్స్ ని కచ్చితంగా మెప్పిస్తుంది. ఇందులో ఓ రైటర్ చనిపోయిన ఓ అమ్మాయి రియల్ స్టోరీని తీసుకొని ఎలా షార్ట్ ఫిలిం తీస్తాడనేది బాగా చూపించారు.
undefined
అహ నా పెళ్ళంట: ఈ మినీ వెబ్ సిరీస్ చాలా ఇంటరెస్టింగ్ గా, మంచి హ్యూమర్ తో బాగా తీశారు. ఒక అమ్మాయి పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి..? ఎవరిని చేసుకోవాలి..? ఆమె పడే స్ట్రగుల్స్ అన్నింటికీ సరైన సమాధానాలు ఇచ్చారు.
undefined
ది బ్రేకప్ కన్సుల్తెంట్ : లవ్ ఫెయిల్ అయిన ఒక అబ్బాయి బ్రేకప్ కన్సల్టెన్సీ ఎలా మొదలు పెడతాడు..? అసలు బ్రేకప్స్ ఎలా జరుగుతాయనే కాన్సెప్ట్ తో దీన్ని తెరకెక్కించారు.
undefined
మైకేల్ మదన్ కామరాజు : ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సిరీస్ చాలా ఫన్నీగా సాగుతుంది.
undefined
ఈ ఆఫీస్ లో : రకరకాల బ్యాక్ గ్రౌండ్స్ కి చెందిన వ్యక్తులను ఒక దగ్గర పడేస్తే ఎలా ఉంటుందనేదే ఈ స్టోరీ. కాంపిటిటివ్ యుగంలో యూత్ ఎలా స్ట్రగుల్ అవుతుందనేది ఇందులో బాగా చూపించారు.
undefined
బీటెక్ : ఈ సిరీస్ తో చాలా మంది రిలేట్ అవుతారు. ఎమోషనల్ గా సాగే ఈ సిరీస్ కి యూత్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
undefined
గ్యాంగ్ స్టర్ : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సిరీస్ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది.
undefined
చిత్ర విచిత్రం : ఇండిపెండెంట్ ఫిలిం తీయాలనుకునే ఇద్దరి కుర్రాళ్ల కథే ఈ సిరీస్.
undefined
మేము : మెచురిటీతో జీవితాన్ని ఎలా ప్రశాంతంగా లీడ్ చేయాలనే కాన్సెప్ట్ తో దీన్ని తెరకెక్కించారు. నేటితరం జనరేషన్ కి ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది.
undefined
పిల్ల పిల్లగాడు : ఫ్రెష్ అండ్ క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఈ సిరీస్ చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటాం.
undefined
click me!